పేదలకు ఇళ్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం..పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇల్లు కట్టుకునే వారికి సగం ఖర్చు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఇళ్లను సొంతంగా నిర్మించుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి నిర్మాణం చేపట్టే పేదలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ ఆర్దిక సాయంతో పాటుగా పేదలకు ఇళ్ల నిర్మాణం..పంపిణీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమయ్యారు.

పేదలకు ఇళ్ల నిర్మాణం
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం..పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయే 100 రోజుల్లో లక్షా 28వేల ఇళ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్దం చేసారు. రాష్ట్రంలో 8లక్షల 4వేల705 ఇళ్లు వివిధ దశలో ఉండగా.. 5లక్షల 76వేల 670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు మంత్రి పార్థసారధి. కనుక రాబోయే వంద రోజుల్లో లక్షా28 వేల ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించారు.

AP Govt to provide rs 4 Lakhs financial assistance for housing beneficaires details here

చంద్రబాబు సమీక్ష
ఇక, ఈ రోజు గృహ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. 2024-25 పీఎంఏవై-యు 2.0 పథకం డ్రాఫ్ట్ గైడ్లైన్స్ లో పెరిగిన ధరల ప్రతిపాదనలతో సమీక్ష చేయాలని నిర్ణయించారు. కొత్త ఎంపిక చేసే లబ్ధిదారులకే ఈ పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కొత్త ఎంపికయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు అందించనున్నారు. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.2.50 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కచ్చితంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వనున్నారు.

ప్రభుత్వ తాజా నిర్ణయం
ఈ రోజు సమీక్షలో చంద్రబాబు ఈ ప్రతిపాదన పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పీఎం ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటి ఇళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల్లోని పేదలకూ ఈ పథకం వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. వైసీపీ హాయంలో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా.. అందులో 6.50 లక్షల ఇళ్లు పూర్తికాగా.. 4 లక్షల ఇళ్లు పునాది దశ కూడా దాటలేదని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. వీటి పైన నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+