జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ కమిషన్ ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమించింది. మరి కొన్ని శాఖలకు కీలక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. అయితే, ఈ బదిలీ ఉత్తర్వుల వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ సన్నిహిత అధికారిగా..గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారితో రహస్య భేటీ జరిపిన అధికారుల్లో తొలి వేటు పడింది.
ఏపీ ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. తాజాగా సీఆర్డీఏ ప్రస్తుత కమిషనర్ కన్నబాబును ఆకస్మికంగా బదిలీ చేసి ఆయన స్థానంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా ఉన్న వి.విజయరామరాజును సీఆర్డీఏ కమిషనర్‌గా నియమించింది. కన్నబాబును పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా నియమించారు. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లను నియమించింది. మార్కెటింగ్ విభాగం డైరెక్టర్‌గా ఉన్న ఎం. విజయసునీతను మార్కాపురం జిల్లాకు, ఆయుష్ విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న కొత్తమాసు దినేశ్‌కుమార్‌ను పోలవరం జిల్లాకు కలెక్టర్లుగా నియమించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి పట్టన్‌శెట్టి రవి సుభాష్‌కు మార్కెటింగ్ విభాగం డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యత అప్పగించారు. కన్నబాబు కీలకమైన సమయంలో సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించారు. రాజధానికి నిధుల సమీకరణ, నిర్మాణ పనుల్ని పూర్తిస్థాయిలో పట్టాలెక్కించడంలో క్రియాశీలంగా వ్యవహరించారు. రాజధాని గ్రామాల సమస్యల్ని పరిష్కరించడంలో కన్నబాబు విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రభుత్వంలో ఉంది. దీంతో, ఆయన్ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

రహస్య మంత్రాంగం పై ప్రభుత్వం సీరియస్
కాగా.. మాజీ సీఎం జగన్ సన్నిహితుడుగా.. మాజీ సీఎస్ గా పని చేసిన జవహర్ రెడ్డిని కొందరు ఐఏఎస్ అధికారులు రహస్యంగా కలిసి మంతనాలు చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగా ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఎండీ కే.నీలకంఠారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. జవహర్‌రెడ్డిని కలిసిన ఐఏఎస్ అధికారుల్లో కొందరి ని సీఎం కార్యాలయానికి పిలిచి వివరణ కోరింది. నెల్లూరులో జరిగిన ఒక వివాహంలో జవహర్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. ధనుంజయరెడ్డి వద్ద నీలకంఠారెడ్డి ఓఎస్డీగా పని చేశారు. అక్కడ ఉండగానే ఆయనకు ఐఏఎస్ గా పదోన్నతి లభించింది. ఆయన ఐఏఎస్ గా ఎంపికయ్యేలా చేయడంలో ధనుంజయరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు చెబుతారు. ధనుంజయ రెడ్డి దగ్గర ఓఎస్డీగా పని చేసిన మహిళా అధికారిణి కుమారుడి వివాహం ఇటీవల నెల్లూరులో జరిగింది. ఆ వివాహం సందర్భంగా నెల్లూరులో కలుసుకుని మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆ నేపథ్యం లో నీలకంఠారెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications