గుంటూరు జీజీహెచ్‌లో హైటెన్షన్.. రోగిలా వచ్చిన ఏపీ ఆరోగ్యశాఖ కార్యదర్శి !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు జరిపి అందరికీ షాక్ ఇచ్చారు. ఎవరికీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. ఆయన సాధారణ రోగిలా ఆసుపత్రికి రావడంతో వైద్య సిబ్బంది, అధికారులు అవాక్కయ్యారు. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కాగా మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో జీజీహెచ్‌లోని ఓపీ (ఔట్ పేషెంట్) విభాగానికి చేరుకున్న సౌరభ్ గౌర్.. తనకు జ్వరంగా ఉందని చెప్పి ఓపీ చీటీ తీసుకున్నారు. అనంతరం వైద్యుడిని సంప్రదించి తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఓపీ సేవలు పూర్తి చేసుకున్న తర్వాత సాధారణ రోగుల మాదిరిగానే ఫార్మసీ వద్ద క్యూలో నిలబడి మందులు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు గంట పాటు ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను రహస్యంగా పరిశీలించారు.

ap-health-department-principal-surprise-inspection-at-guntur-government-hospital

అయితే అప్పటికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందింది. దీంతో అధికారులు, సిబ్బంది హుటాహుటిన అప్రమత్తమై సౌరభ్ గౌర్ వద్దకు పరుగులు తీశారు. అప్పటికే ఆయన ఆర్థోపెడిక్ ఓపీ వద్ద ఉండగా.. సూపరింటెండెంట్‌ వచ్చి నమస్కరించడంతో చుట్టూ ఉన్న రోగులు, ఇతర సిబ్బంది ఆశ్చర్యపోయారు. అనంతరం సౌరభ్ గౌర్, సూపరింటెండెంట్‌ను వెంటబెట్టుకుని ల్యాబ్, మెడికల్ ఓపీ వంటి కీలక విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అయితే ఈ తనిఖీల్లో ఆయన వైద్యుల పనితీరు, రోగులతో వారి ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒక పీజీ వైద్య విద్యార్థి రోగులతో కటువుగా మాట్లాడటాన్ని గమనించి అతడిని పిలిచి మాట్లాడినట్లు సమాచారం. అంతేకాకుండా మందుల చీటీలపై సరైన విధానం పాటించకపోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి వైద్యుడి పనితీరును అంచనా వేయడానికి సంబంధించిన 'కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్‌ (KPI - పనితీరు సూచిక) వివరాలను కూడా ఆయన తీసుకున్నారు.

మరోవైపు గుంటూరు జీజీహెచ్‌లో జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మందులను పక్కన పెట్టి.. ఇటువంటి షాపులు పెట్టి అమ్మకాలు చేయడంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తపరిచారు. ఈ షాపులపై సమగ్ర విచారణ జరిపించి, దీనికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ అనూహ్య ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+