స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈనెల 15వ తేదీకి న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. ఈరోజు జరగాల్సిన విచారణకు అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ ప్రత్యేక పీపీ వివేకనంద కోర్టుకు వెల్లడించారు. ముందుగా ఈ కేసును 22వ తేదీకి వాయిదా వేయాలని పీపీ కోరారు. అయితే ఆయన అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది.
స్కిల్ కేసులో చంద్రబాబును ఏ37గా చేరుస్తూ సెప్టెంబర్ లో అరెస్టు చేసిన సీఐడీ.. ఏసీబీ కోర్టులో ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ సమర్పించి రాజమండ్రి జైలుకు పంపింది. అక్కడ 52 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత అనారోగ్య కారణాలతో బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా పడింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సెక్షన్ 17-ఏకు సంబంధించిన తీర్పును దీపావళి సెలవుల అనంతర వెలువరించాలనుకుంటున్నామని, అప్పటివరకు వేచిచూడాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు సూచించారు.
ఈ కేసులో తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడాదని ఇదివరకే మౌఖికంగా ఆదేశించినందున ఆ ఉత్తర్వును కొనసాగించాలని లూథ్రా కోరారు. ఫైబర్ నెట్ కేసును ఈనెల 23కు వాయిదా వేయాలని జస్టిస్ అనిరుధ్ బోస్ నిర్ధేశించారు. అయితే తన కుమారుడి వివాహం ఉండటంతో హాజరుకాలేకపోతున్నానని, 29 లేదంటే 30వ తేదీకి వాయిదా వేయాలని లూథ్రా కోరారు. దీంతో ధర్మాసనం 30వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications