మోడీ భీమవరం టూర్ కు రఘురామ-జగన్ భయపెట్టినా-కేంద్రం మౌనంగా ఉండిపోయినా !

ఈ నెల 4న ప్రధాని మోడీ విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు భీమవరం వస్తున్నారు. ఈ పర్యటనలో పాల్గొనేందుకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఏపీలో అడుగుపెడితే వైసీపీ సర్కార్ అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో ఆయన ఈ టూర్ లో పాల్గొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన కేంద్ర హోంశాఖను కూడా భద్రత కోరారు. అయితే అనూహ్యంగా ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది.

 మోడీ భీమవరం టూర్ కు రఘురామ

మోడీ భీమవరం టూర్ కు రఘురామ

ఈ నెల 4న ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు వస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు మోడీ హాజరవుతున్న సందర్భంగా వివిధ పార్టీల అధినేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. అదే సమయంలో వైసీపీ రెబెల్ నేత, స్ధానిక ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజునూ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించారు.అయితే ఈ పర్యటన కోసం ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న రఘురామరాజు తిరిగి ఏపీకి రావాల్సి ఉంటుంది. అయితే గతంలో ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో రఘురామ ఇన్నాళ్లూ ఢిల్లీలోనే ఉండిపోయారు. కానీ ఇప్పుడు అనుకోకుండా మోడీ టూర్ రూపంలో ఆయనకు మంచి అవకాశం లభించింది.

 రఘురామకు హైకోర్టు అనుమతి

రఘురామకు హైకోర్టు అనుమతి

ప్రధాని మోడీ భీమవరం టూర్ లో పాల్గొనేందుకు తాను ఏపీకి వస్తే పోలీసులు తనపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ఇవాళ రఘురామరాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. రఘురామరాజుకు భారీఊరటనిచ్చింది. రఘురామపై అప్పటికప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం కుదరదని, అరెస్టు చేయాలంటే తప్పనిసరిగా ప్రోసీజర్ పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. దీంతో రఘురామను అరెస్టు చేయాలంటే పోలీసులు ఈసారి కచ్చితంగా నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది.
హైకోర్టు భరోసాతో రఘురామ ఇప్పుడు భీమవరం టూర్ కు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

 జగన్ భయపెట్టినా, కేంద్రం సహకరించకున్నా..

జగన్ భయపెట్టినా, కేంద్రం సహకరించకున్నా..

ప్రధాని మోడీ భీమవరం టూర్ ను సాకుగా చూపి రఘురామకృష్ణంరాజు ఏపీకి రావడం తథ్యమని భావించిన జగన్ సర్కార్ ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టగానే అరెస్టు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ పార్లమెంటరీ కమిటీ భేటీకి వైజాగ్ వచ్చేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేస్తామని డీజీపీ హెచ్చరించారు. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు జగన్ అరెస్టు చేయిస్తారన్న భయాలు ఉండటంతో కేంద్ర హోంశాఖ ను రఘురామ సాయం కోరారు. తనకు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కానీ హోంశాఖ ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రఘురామకు భారీ ఊరటగా చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+