ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్‌

జగజ్జననీ చిట్‌ఫండ్‌ కేసులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు శ్రీనివాస్‌ (వాసు)కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రెండు రోజుల క్రితమే వాదనలు ముగియగా జడ్జి తీర్పును రిజర్వు చేసి ఈరోజు ఉత్తర్వులిచ్చారు.

జగజ్జననీ చిట్‌ఫండ్ వ్యవహారంలో అప్పారావు, వాసులను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ వీరు హైకోర్టును ఆశ్రయించారు. చిట్ ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదని పటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. డిపాజిట్ దారుల ఫిర్యాదు లేకుండా కేసు నమోదు చేశారన్నారు. చందాదారుల సొమ్మును చట్టవిరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారని ప్రభుత్వ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.

ap high court granted bail to tdp leaders adireddy apparao and vasu

ఈ కేసులో సోమవారమే వాదనలు ముగిశాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. జగజ్జననీ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై 'డిపాజిటర్ల చట్టం' కింద సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదని, డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే ఆ చట్టం వర్తిస్తుందన్నారు. సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని ఏ ఒక్క చందాదారుడూ(డిపాజిటర్‌) ఫిర్యాదు చేయలేదన్నారు.

చిట్‌ నిర్వహణలో ఏవైనా లోపాలను గుర్తిస్తే.. ఆ విషయాన్ని రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రస్తుత కేసులో అందుకు భిన్నంగా కాకినాడ సహాయ రిజిస్ట్రార్‌ వ్యవహరించారని, ఆయన నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు. పిటిషనర్లను జైలుకు పంపాలనే దురుద్దేశం దీనివెనక ఉందని, గతంలో నిర్వహించిన తనిఖీలలో సొమ్ము చెల్లింపు తేదీల్లో తేడాలున్నాయని మాత్రమే గుర్తించారని, చిన్న లోపాలుంటే అవి చిట్‌ ఫండ్‌ చట్ట పరిధిలోకి వస్తాయని, 'డిపాజిటర్ల చట్టం' వర్తించదన్నారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+