Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అశోక్ బాబుకు హైకోర్టులో నో బెయిల్-ఉద్యోగుల పోరుకు సూత్రధారి- సర్కార్ అనుమానం ?

నకిలీ విద్యార్హతల కేసులో ఏపీ సీఐడీ నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన దాఖలు చేసుకున్న లంచ్ మోహన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బెయిల్ నిరాకరించింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఉద్యోగుల ఛలో విజయవాడ సక్సెస్ వెనుక ఉన్నారని ప్రభుత్వం అనుమానిస్తుండటం వల్లే ఆయన్ను సీఐడీతో మరో కేసులో అరెస్టు చేయించినట్లు తెలుస్తోంది.

 అశోక్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

అశోక్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు హైకోర్టులో ఇవాళ చుక్కెదురైంది. సర్వీసులో ఉండగా నకిలీ విద్యార్హతలతో పదోన్నతి పొందిన వ్యవహారంలో లోకాయుక్త ఆదేశాల మేరకు విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనపై సీఐడీ కేసులు నమోదు చేయించింది. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. అయితే సీఐడీ కస్టడీలో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అశోక్ బాబు దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ విచారణ జరిపిన న్యాయమూర్తి తక్షణం అయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

 వైసీపీకి కంటగింపుగా

వైసీపీకి కంటగింపుగా

ఒకప్పుడు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడుగా ఉంటూ సమైక్యాంధ్ర ఉద్యమ సారధిగా మారిపోయిన పర్చూరి అశోక్ బాబు అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులకు కంటగింపుగా మారిపోయారు. ముఖ్యంగా అప్పటివరకూ ఉద్యోగులకు మాత్రమే తెలిసిన అశోక్ బాబు కాస్తా ఎల్బీ స్టేడియంలో సమైక్యాంధ్ర సభతో రాష్ట్రవ్యాప్తంగా విశేష ప్రచారం పొందారు. టీడీపీ, కాంగ్రెస్ వెనకుండి అశోక్ బాబును నడిపించారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఎన్జీవోల నేతగా కొనసాగిన అశోక్ బాబు.. ఆ తర్వాత తన పదవిని వదులుకుని మరీ తనకున్న పరిచయాలతో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అయ్యారు. అప్పటి నుంచీ వైసీపీకి కంటగింపుగా మారిపోయారు.

 ఉద్యోగులపై అశోక్ బాబు పట్టు

ఉద్యోగులపై అశోక్ బాబు పట్టు

ఏపీ ఎన్జీవోవ సంఘం అధ్యక్షుడిగా రెండుసార్లు కొనసాగిన అశోక్ బాబుకు ఇతర ఉద్యోగసంఘాలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉద్యోగుల సాయంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్మించి అప్పట్లో అధికారంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, దానికి అండగా ఉన్న టీడీపీకి సాయం చేస్తూ వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అలాగే విభజన తర్వాత టీడీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో ఉద్యోగులకు ఆయన వ్యక్తిగతంగా చాలా సాయం చేశారన్న పేరు కూడా ఉంది. దీంతో ఉద్యోగుల్లో ఇప్పటికీ ఏదైనా సమస్య వస్తే ఆయన్ని సంప్రదిస్తుంటారు. ఇదే కోవలో పీఆర్సీ పోరులోనూ ఆయన పాత్ర ఉందనే ప్రచారం ఉంది.

 పీఆర్సీ పోరు కుట్రదారుగా సర్కార్ అనుమానం ?

పీఆర్సీ పోరు కుట్రదారుగా సర్కార్ అనుమానం ?

ఏపీలో తాజాగా ఉద్యోగులు నడిపించిన పీఆర్సీ పోరు విజయవంతం కావడం వెనుక అశోక్ బాబు వ్యూహాలే ఉన్నాయని సర్కార్ అనుమానిస్తోంది. ముఖ్యంగా వైసీపీకి ఎప్పటినుంచో వ్యతిరేకంగా ఉన్న ఆయన.. ఉద్యోగుల్ని ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నారనే నివేదికలు సర్కార్ వద్ద ఉన్నాయి. దీంతో ఆయనపై ఎప్పటి నుంచో ప్రభుత్వం నిఘా ఉంది. దీంతో గతంలో నకిలీ విద్యార్హతలతో పదోన్నతి పొందినట్లు ఆయనపై వచ్చిన ఆరోపణల్ని సాకుగా తీసుకుని ప్రభుత్వం పాత కేసును తిరగతోడింది. దీంతో సీఐడీ అశోక్ బాబుపై తాజాగా పలు కేసులు నమోదు చేసింది. ఉధ్యోగులు సమ్మె ప్రతిపాదన విరమించుకున్నా టీచర్లు ఇంకా పోరుబాటలోనే ఉండటం వెనుక కూడా అశోక్ ఉన్నారనే అనుమానాలు ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన దూకుడుకు అట్టుకట్ట వేసేందుకే సీఐడీ కేసులో అరెస్టు చేసినట్లు అర్ధమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+