నరేంద్రమోడీ, వైఎస్ జగన్ కు ఒకేసారి షాకిచ్చిన జేడీ లక్ష్మీనారాయణ!!
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ రిటైర్డ్ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. జేడీ లక్ష్మీనారాయణ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది బాలాజీ ఆర్టికల్ 21కి విరుద్ధంగా ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రయివేటు పరం చేస్తోందని, కర్మాగారం కోసం వేల సంఖ్యలో రైతుల నుంచి 22వేల ఎకరాలను అప్పటి కేంద్ర ప్రభుత్వం సేకరించిందని, 9200 కుటుంబాలకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కొన్ని కుటుంబాల్లో నాలుగో తరం ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వకపోవడం ప్రభుత్వ అలసత్వాన్ని తెలియజేస్తోందన్నారు.
Recommended Video

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తొందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రైవేటీకరణ చేసే బదులుగా కేంద్రానికి తాము పలు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. పిటిషనర్, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఉక్కు కర్మాగారాలకు కౌంటర్లు దాఖలు చేయడానికి ఈనెల 21వ తేదీని గడువుగా ఇచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ మినహా ఇతర పార్టీలన్నీ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రయివేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications