ఏపీ హైకోర్టు న్యాయమూర్తి భట్టు దేవానంద్ బదిలీ..!!

ఏపీ - తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవరాజు నాగార్జునను మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాది నవంబర్‌లో ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయమూర్తి దేవానంద్ బదిలీ ప్రతిపాదన పైన అప్పట్లో న్యాయవాదులు నిరసన తెలిపారు.

ఇప్పుడు అధికారికంగా కేంద్ర న్యాయ శాఖ గెజిట్ జారీ చేసింది. గత ఏడాది నవంబర్ లో తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐదుగురు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. ఆ జాబితాలో బట్టు దేవానంద్ ఉన్నారు. అదే లిస్టులో జస్టిస్‌ డి.రమేష్‌ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అవగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ నాగార్జున మద్రాసు హైకోర్టుకు బదిలీ కాగా, జస్టిస్ ఎ.అభిషేక్‌ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ నుంచి దేవానంద్ తో పాటుగా రమేష్ బదిలీకి సంబంధించి న్యాయవాదులు ఆందోళనకు దిగారు.

AP High Court judge Justice Bhattu Devanand Transfer to Madra High court, Central issues notification

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని నాటి నిరసనల్లో భాగంగా వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల బదిలీలపై లాయర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని లాయర్లు నాడు విమర్శలు చేసారు. ఇక, ఇప్పుడు నాటి కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ రోజు ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీ హైకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవరాజు నాగార్జునను మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేసింది. అలాగే మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జ్యుడీయల్‌ అధికారి పీ వడమాలైని నియమించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+