Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడు రాజధానుల పై నేడే తీర్పు - హైకోర్టు జడ్జిమెంట్ పై ఉత్కంఠ..!!

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పైన కీలక తీర్పు వెలువడనుంది. మూడు రాజధానుల అంశంతో పాటుగా సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవ్వబోయే జడ్జిమెంట్ పైన ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత 2019 డిసెంబర్ లో అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రతిపాదన చేసారు.

మూడు రాజధానులపై భారీగా పిటీషన్లు

మూడు రాజధానులపై భారీగా పిటీషన్లు

ఆ తరువాత మూడు రాజధానుల బిల్లుతో పాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లును తీసుకొచ్చి.. చట్టం చేసారు. వీటి పైన అమరావతి ప్రాంత రైతులు.. స్థానికులు పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. అయితే, ఇవి విచారణలో ఉన్న సమయంలోనే కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం ఆకస్మికంగా ఆ రెండు చట్టాలను రద్దు చేస్తూ బిల్లులను ఉప సంహరించుకుంది. అదే సమయంలో మరింత సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును సభ ముందుకు తీసుకొస్తామని సీఎం జగన్ స్పష్టం చేసారు. అయితే, హై కోర్టులో దీని పైన విచారణ సాగింది. రెండు పక్షాల వాదనలను న్యాయస్థానం విన్న తరువాత కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది.

ప్రభుత్వం బిల్లుల ఉపసంహరణ

ప్రభుత్వం బిల్లుల ఉపసంహరణ


మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. అదే సమయంలో తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చిన సమయంలో జరిగిన ఒప్పందం అమలయ్యేలా చూడాలని పిటీషనర్లు కోర్టును కోరారు. గతంలో ఆమోదించిన అమరావతి మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలని నివేదించారు. భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని... హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫై చేసిన నేపథ్యంలో దాని విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని అభ్యర్ధించారు.

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని .. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాన్ని కొనసాగించాలని తమ వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇలా.. రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ ఉదయం దీని పైన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు లోని అంశాలు..కోర్టు ఆదేశాల మేరకు మూడు రాజధానుల వ్యవహారంలో ప్రభుత్వ తదుపరి ఆలోచనలు ఆధారపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో..కోర్టు తీర్పు పైన ఉత్కంఠ నెలకొని ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+