కాపు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక సూచన - ఒత్తిడి తెండి..!!
కాపు రిజర్వేషన్ల పై కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని హైకోర్టు సూచించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (ఈడబ్ల్యూఎ్‌స)కు కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతంకోటా అమలు కోసం దాఖలైన వ్యాజ్యాల విచారణ వేళ హైకోర్టు ఈ సూచన చేసింది. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో రిజర్వేషన్ అమలును సర్కారు జాప్యం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.
పిటీషనర్లకు కోర్టు సూచనలు:కొంత కాలంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల (ఈడబ్ల్యూఎ్‌స)కు కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతంకోటా అమలు చేస్తూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశం పైన మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు పిటీషనర్లకు కీలక సూచనలు చేసింది. పిటిషన్లను ఉపసంహరించుకుని వేరే విధంగా దానిపై ఒత్తిడి తీసుకురావాలని పిటిషనర్లకు సలహా ఇచ్చింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది.

కాపులకు 5 శాతం రిజర్వేషన్:కాపులకు రిజర్వేషన్ అమలు కోసం, అదే సమయంలో వాటిని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో లోతైన విచారణ చేకయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటీషన్లలో ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మాజీ సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ వ్యవహారంలోనే మరి కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఇవ్వటాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించిందని పిటీసణర్ల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
కౌంటర్ దాఖలుకు ఆదేశం:మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు తన వాదనలు వినిపిస్తూ ఈడబ్ల్యూఎస్ పది శాతం కోటాలో ఒకే సామాజిక వర్గానికి అయిదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేసామని చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ తన వాదనల్లో భాగంగా కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కావాలని కోరారు. ఈ వ్యవహారంలో కీలక అంశాలు ఉన్నాయని నివేదించారు. దీని పైన లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో, న్యాయస్థానం ఈ కేసును వాయిదా వేసింది.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి!











Click it and Unblock the Notifications