ఎస్సై నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశం-కోర్టు సమక్షంలో ఎత్తు కొలతలు..
ఏపీలో సబ్ ఇన్ స్పెక్టర్ల(ఎస్సైలు) నియామక ప్రక్రియ విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. తమ ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం చేశారని ఆరోపిస్తూ అభ్యర్ధులు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఫలితా విడుదలపై స్టే ఇచ్చింది. దీనిపై ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ లో వాదనలు జరిగాయి.
గతంలో ఎస్సై నియామక ప్రక్రియ విషయంలో తమ ఎత్తు కొలిచే విషయంలో అన్యాయం చేశారంటూ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ .. ఫలితాలను నిలిపేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్... ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కీలక ఆదేశాలు ఇచ్చింది.

గత విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ .. అభ్యర్ధుల ఎత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. తమ సమక్షంలోనే మరోసారి వారి ఎత్తు కొలిచేలా ఆదేశాలు ఇస్తామని, అందులో తేడా వస్తే పిటిషనర్లకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇవాళ విచారణలో ఎత్తు కొలిచేందుకు వారిని వచ్చే సోమవారం తమ ముందు హాజరు కావాలని కోరింది. దీంతో పిటిషనర్లైన అభ్యర్ధులు సోమవారం హైకోర్టు కమిటీ ముందు ఎత్తు కొలత కోసం హాజరుకావాల్సి ఉంది.
సోమవారం పిటిషనర్ల ఎత్తు కొలిచిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ తమ నిర్ణయం ప్రకటించబోతోంది. గతంలో ఎస్సై నియామకాల ఎత్తు కొలిచే సందర్భంగా అప్పటికే ఆర్ఎస్సైగా ఉన్న అభ్యర్ధిని అనర్హుడిగా చేయడం సరికాదని ఇవాళ విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు.












Click it and Unblock the Notifications