ఆయేషా కేసు అప్పగించిన హైకోర్టు : ఇప్పుడు బాబు సీబిఐను ఆపగలరా..!
రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలో జరిగిన ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ కి అప్పగి స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు లో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. గత కొంత కాలంగా దీనిపై విచారణ కొనసాగిస్తున్న ఉన్నత న్యాయస్థానం సిట్ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. కొద్ది రోజుల క్రితం ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో సిబిఐ విచారణ జరగాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలని ఉత్వర్వులు జారీ చేసింది. అయితే, ఇది కోర్టు ఉత్తర్వు కావటంతో సిబిఐ విచారణ కొనసాగనుంది.
విజయవాడ లో జరిగిన ఆయేషా హత్య కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగింది. తాజాగా, హైకోర్టు తీర్పుతో ఈ కేసు మరో సారి మొదటి నుండి విచారణ జరగనుంది. ఈ హత్య కేసుకు సంబంధించి 2010 లో సత్యంబాబు ను దోషిగా తేలుస్తూ విజ యవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. దీని పై సత్యంబాబు..తాను నిర్దోషిని అంటూ హైకోర్టులో అప్పీల్ కు వెళ్లారు. ఆయన అప్పీ ల్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పు నిచ్చింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం పై విచారణ జరిపించాలని ఆయేషా తల్లి తండ్రులతో పాటుగా ప్రజా -మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పరిస్థితుల్లో ఏపి ప్రభుత్వం ఈ కేసు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు సాగిస్తున్న క్రమంలో కీలక సాక్ష్యాధారాలు..రికార్డులు లేవని కోర్టుకు నివేదిక ఇచ్చారు. దీని పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా ఈ రోజు ఈ కేసు పై విచారణ జరిగిప కోర్టు పోలీసుల తీరు..దర్యాప్తు వ్యవహారం పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును సిబిఐ తో విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన తీర్పులు..దర్యాప్తులతో ఏ మాత్రం ప్రభావం కాకుండా ఈ కేసు విచారణ చేపట్టాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం ఏపిలో సిబిఐ విచారణ కు అనుమతి ఇవ్వకూడదని ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించే అధికారం సిబిఐ కి ఉంటుంది. ఇప్పుడు ఆయేషా మీరా కేసులో కోర్టు తీర్పును అనుసరించి సిబిఐ విచారణ చేపట్టనుంది. ఏపిలో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోర్టు ఆదేశించిన తొలి సిబిఐ విచారణ కేసు ఇదే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications