చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు కీలక నిర్ణయం...
ఏపీలో స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ విషయంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకు అక్కడా నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభించిన హైకోర్టు ధర్మాసనం.. దసరా సెలవుల కారణంగా దీన్ని వాయిదా వేసింది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ కూడా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. అవి పూర్తి కాకపోవడం, దసరా సెలవుల కారణంగా దీన్ని వెకేషన్ బెంచ్ కు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జస్టిస్ సురేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై విచారణను వెకేషన్ కోర్టుకు వేయాలని ఆయన లాయర్లు కోరారు. దీనికి జడ్జి సురేష్ రెడ్డి అంగీకరించారు.

దీంతో దసరా సెలవుల నేపథ్యంలో వెకేషన్ బెంచ్‍పై విచారణ కొనసాగనుంది. మరోవైపు ఇవాళ వాదనల సందర్భంగా చంద్రబాబు బెయిల్ కోసం ఆయన లాయర్ లూథ్రా పట్టుబట్టారు. చంద్రబాబుకు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని లూథ్రా కోర్టును కోరారు. అనంతరం వెకేషన్ బెంచ్ కు విచారణ మారడంతో.. వచ్చే విచారణకు చంద్రబాబు హెల్త్ రిపోర్టును పంపించాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అలాగే చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై విచారణ వెకేషన్ బెంచ్‍లో చేస్తామని తెలిపారు.
మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై రేపు తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభించకముందే సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటే మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications