హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్లు-విచారణ మళ్లీ వాయిదా- ఆగస్టు 23కు
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో తరచూ వాయిదాలు పడుతున్న మూడు రాజధానుల పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ విచారణ జరపాలని గతంలో నిర్ణయించిన హైకోర్టు.. తాజాగా ఆగస్టు 23కు వాయిదా వేసేసింది.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ కూడా ఆమోదించారు. అయితే ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ ఓ స్ధాయి వరకూ జరిగిన తర్వాత ఈ ఏడాది జనవరిలో ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై వెళ్లిపోయారు దీంతో విచారణ పూర్తిగా మొదటికొచ్చింది. ఆ తర్వాత ఛీఫ్ జస్టిస్‌గా వచ్చిన జస్టిస్ అరూప్ గోస్వామి రెగ్యులర్ విచారణకు సిద్ధమయ్యారు.

మూడు రాజధానుల పిటిషన్లపై మార్చిలో విచారణ ప్రారంభించిన జస్టిస్ అరూప్ గోస్వామి ధర్మాసనం.. ఆ తర్వాత విచారణను మే 3కు వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారణ జరిగినా తిరిగి ఆగస్టు 23కు వాయిదా వేసింది. దీంతో రాజధానుల తరలింపు వ్యవహారం మరింత ఆలస్యం కాబోతోంది. ఆగస్టులో విచారణ ప్రారంభమైనా ఇది ఎప్పటికల్లా పూర్తవుతుందో చెప్పలేని పరిస్ధితి. దీంతో వచ్చే ఏడాది రాజధాని తరలింపు జరుగుతుందా లేదా అన్న దానిపైనా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications