సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష- జరిమానా..!!

సీనియర్ అధికారుల పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సీనియర్ ఐఏఎస్..ఐపీఎస్ తో సహా మరో ముగ్గురు ఉన్నతాధికారుల పైన న్యాయస్థానం సీరియస్ అయింది.
సీనియర్ ఐఏఎస్ కృష్ణ బాబు , ఐపీఎస్ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధించింది.16లోగా రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే జైలుకు పంపాలని రిజిస్ట్రార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆర్టీసీలో ఫీల్డ్‌మెన్‌గా పనిచేస్తున్న చిత్తూరు కు చెందిన బి.సురేంద్ర, మరో ముగ్గురు తమ సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం... ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి జీతాలకు 7% వడ్డీ కలిపి పిటిషనర్లకు చెల్లించాలంటూ 2022 ఆగస్టులో ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు అమలుకాకపోవడంతో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్ పెండింగ్‌లో ఉందంటూ ఆర్టీసీ లాయర్లు వాదించారు. అప్పీల్‌పై డివిజినల్ బెంచ్ స్టే విధించలేదని హైకోర్టు గుర్తుచేసింది. అందుకే అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

AP High Court sentenced to one month imprisonment and a fine of one thousand rupees for IAS Krishna Babu and IPS Dwaraka Tirumala Rao

ఆదేశాల అమల్లో ఇబ్బందులు ఉంటే కోర్టుకు వివరించి గడువును పొడిగించాలని అభ్యర్ధించాలని పేర్కొంది. కానీ, ఈ కేసులో అధికారులు అలాంటి ప్రయత్నాలు చేయలేదని వ్యాఖ్యానించింది. గత ఆరు నెలలు గా అప్పీల్ పెండింగ్ లో ఉందనే చెబుతున్నారని, ఇది ఉద్దేశ పూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటమేనని కోర్టు అభిప్రాయపడింది. సర్వీసు క్రమబద్దీకరణ కోసం దాఖలైన ఈ వ్యాజ్యంలో విచారణ జరిపిన న్యాయమూర్తి అధికారుల తీరును తప్పుబట్టారు. అధికారులు దాఖలు చేసిన అప్పీల్ లో డివిజన్ బెంచ్ స్టే ఇస్తేనే కోర్టు ధిక్కరణ కేసులో ముందుకెళ్లటానికి వీలుండదన్నారు. కోర్టు ఆదేశాల అమలు కోసం పలు మార్తు సమయం ఇచ్చినా..అమలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకున్నారన్నారు. కృష్ణ బాబు , ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు తో సహా మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకు కూడా కోర్టు శిక్ష, జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+