ఏపీ ప్రభుత్వానికి షాక్ - జీవో నెంబర్ 1 పై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

రాష్ట్రంలో కొంత కాలంగా రాజకీయ వివాదంగా మారిన జీవో నెంబర్ 1పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించారు. దీంతో, బహిరంగ సభల నిర్వహణపైన ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 1 పేరున రోడ్ల పైన బహిరంగ సభలను నిషేధించారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతితో సభల నిర్వహణకు వీలుగా జీవో జారీ చేసారు. దీని పైన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదే అంశం పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు జీవో అమలు పైన స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో జీవో నెంబర్ 1 - రాజకీయ వివాదం

ఏపీలో జీవో నెంబర్ 1 - రాజకీయ వివాదం


ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 పైన రాజకీయంగా ప్రభుత్వం పైన విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలను అడ్డుకోవటం కోసమే ఈ జీవో తీసుకొచ్చారంటూ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో ఈ జీవో కారణంగా చూపుతూ ముందుగా నిర్ణయించిన సభలకు అనుమతి నిరాకరించారు. దీని పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. తనను అడ్డుకున్న పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో బ్రిటిష్ చట్టాలకు అనుగుణంగా ఉందని..అసంబద్దంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో, పాదయాత్రగాగా కుప్పం గ్రామాల్లో పర్యటించారు. కుప్పంలో పోలీసులు చంద్రబాబు ను అడ్డుకోవటం పైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా చంద్రబాబుకు ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు.

వెకేషన్ బెంచ్ లో విచారణ

వెకేషన్ బెంచ్ లో విచారణ


ఇద్దరు నేతలు జీవో నెంబర్ 1 ఉప సంహరించుకొనే వరకూ పోరాటం చేయాలని నిర్ణయించారు. మిగిలిన పార్టీలను కలుపుకొని వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే, ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన ఉత్తర్వులుగా పేర్కొంది. వైసీపీతో సహా ప్రతీ రాజకీయ పార్టీకి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ జీవో పైన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం కీలక అంశాలను కోర్టుకు నివేదించారు. కోర్టులో పిల్ దాఖలైన అంశం పైన తమకు సమాచారం లేదని వెల్లడించారు. వెకేషన్ బెంచ్ కు విధానపరమైన నిర్ణయాలను విచారించే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. నిబంధల ప్రకారం రోస్టర్ కు అవకాశం లేదని తన అభిప్రాయంగా వెల్లడించారు.

జీవో పై స్టే - ప్రభుత్వానికి ఆదేశం

జీవో పై స్టే - ప్రభుత్వానికి ఆదేశం


దీంతో, వెకేషన్ సమయంలో రాజకీయంగా ప్రయోజనాల కోసం దురద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. దీని పైన న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనలు విన్న తరువాత జీవో నెంబర్ 1 ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నెల 23వ తేదీ వరకు జీవో నెంబర్ 1 పైన స్టే విధించారు. ఈ నెల 20వ తేదీ లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు ప్రభుత్వం 23వ తేదీ తరువాత కోర్టు ప్రొసీడింగ్స్ వరకు వేచి చూస్తుందా..లేక తాజా ఉత్తర్వుల పైన అప్పీల్ కు వెళ్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం కోర్టుకు సంక్రాంతి సెలవులు ఉండటంతో, ప్రభుత్వం వేయనున్న అడుగు ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+