సీబీఐకి ఏపీ హైకోర్టు వార్నింగ్-పంచ్ ప్రభాకర్ అరెస్టుకు 10 రోజుల డెడ్ లైన్- లేకుంటే సిట్ ఏర్పాటు

ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులకు, వారు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారాన్ని న్యాయస్ధానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసులో నిందితుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడంలో సీబీఐ విఫలమవుతోందని భావిస్తున్న హైకోర్టు.. తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకోనుంది. ముఖ్యంగా ఇప్పటికే సోషల్ పోస్టుల వ్యవహారంతో వైసీపీ సర్కార్ మాత్రమే ఇరుకునపడిందని భావిస్తుండగా..ఇప్పుడు సీబీఐ కూడా ఇరుకునపడుతోంది.

జడ్జీలపై సోషల్ పోస్టుల కేసు

జడ్జీలపై సోషల్ పోస్టుల కేసు

గతేడాది ఏపీలో హైకోర్టు జడ్జీలు ఇచ్చిన పలు తీర్పులు వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన కొందరు ఆక్రోశంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ట్విట్టర్, యూట్యూబ్ లలో చేసిన ఈ పోస్టులు తీవ్ర కలకలం రేపాయి. వీటిపై ప్రభుత్వం అప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. పట్టించుకోలేదు. దీంతో ఓ న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు.. తొలుత సీఐడీ దర్యాప్తుకు ఆధేశించింది. కానీ సీఐడీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఆ తర్వాత సీబీఐకి దర్యాప్తు అప్పగించింది.

సీబీఐ దర్యాప్తు నత్తనడక

సీబీఐ దర్యాప్తు నత్తనడక

హైకోర్టు జడ్డీలపై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ... పలువురు నిందితుల్ని అరెస్టు చేసింది. అయితే ఇంకా చాలా మంది నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉంది. ఇందులో కొందరు విదేశాల్లో తలదాచుకుంటున్నారు. వీరిని స్వదేశానికి రప్పించడం ఇప్పుడు సీబీఐకి కష్టసాధ్యంగా మారుతోంది. దీంతో సహజంగానే సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అదే సమయంలో తాజాగా సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత పట్టాభిని పోలీసులు హడావిడిగా అరెస్టు చేయడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై వ్యాఖ్యలు చేసిన వారిపై ఈ తొందర లేదేంటని ప్రశ్నించింది. దీంతో అటు వైసీపీ సర్కార్ తో పాటు ఇటు సీబీఐ కూడా ఇరుకనపడ్డాయి.

 పంచ్ ప్రభాకర్ అరెస్టుకు హైకోర్టు డెడ్ లైన్

పంచ్ ప్రభాకర్ అరెస్టుకు హైకోర్టు డెడ్ లైన్

అదే సమయంలో సోషల్ మీడియాలో జడ్డీలపై పోస్టులు, వీడియోలు పెట్టిన వ్యవహారంలో నిందితుడిగా ఉన్న వైసీపీ సానుభూతిపరుడు, కార్యకర్త పంచ్ ప్రభాకర్ పై హైకోర్టు సీరియస్ గా ఉంది. సోషల్ పోస్టుల వ్యవహారంలో నిందితుడిగా ఉన్న పంచ్ ప్రభాకర్ ను ఇప్పటివరకూ సీబీఐ అరెస్టు చేయకపోవడంపై హైకోర్టు తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులుగా పంచ్ ప్రభాకర్ ను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని సీబీఐపై ఫైర్ అయింది. అయితే దీనికి సీబీఐ వద్ద నేరుగా సమాధానం లేకపోవడంతో హైకోర్టు ఆగ్రహం రెట్టింపైంది. దీంతో పది రోజుల్లో పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయాల్సిందేనని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది.

సీబీఐ విఫలమైతే రంగంలోకి సిట్

సీబీఐ విఫలమైతే రంగంలోకి సిట్


పంచ్ ప్రభాకర్ అరెస్టు విషయంలో సీబీఐ అలసత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు... ఇందుకు పది రోజుల గడువు విధించింది. గడువులోగా పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయకపోతే విచారణ నుంచి సీబీఐను తప్పించి ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తామని, సిట్ తో ఈ కేసు దర్యాప్తు చేయిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తామని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు సీబీఐ కూడా ఇరుకునపడింది. సోషల్ పోస్టుల వ్యవహారంపై దర్యాప్తు నివేదికను తమ ముందు ఉంచాలని సీబీఐ డైరెక్టర్ కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+