జగన్ కు స్పెషల్ ములాఖత్- 25 లక్షల ఖర్చు- కీలక విషయం చెప్పిన హోంమంత్రి అనిత..!
ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు జైలుకు వెళ్లి ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్ లో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా చేసిన విమర్శలు కలకలం రేపాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్ చేసిన విమర్శలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే విరుచుకుపడుతుండగా.. హోంమంత్రి వంగలపూడి అనిత మరో కొత్త విషయం చెప్పారు.

ఇవాళ నెల్లూరు జైలుకు వెళ్లి తిరిగి బయటికి వచ్చాక జగన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. పిన్నెల్లిపై హత్యాయత్నం, ఈవీఎం ధ్వంసం చేసిన ఆధారాలు దొరికాయని, అందుకే అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అనిత తెలిపారు. జగన్ ఆయన్ను జైలుకు వెళ్లి కలవాలని అనుకోవడంలోనూ తప్పులేదన్నారు. ఓ పాతిక లక్షలు హెలికాఫ్టర్ కు ఖర్చుపెట్టి మరీ వెళ్లడం ఆయన ఇష్టమన్నారు. అయితే పిన్నెల్లికి ములాఖత్ లు పూర్తయ్యాయని తెలిసీ జగన్ అక్కడికి వెళ్లడంలో అర్ధమేంటని అనిత ప్రశ్నించారు.
పిన్నెల్లికి ములాఖత్ లు పూర్తయినా జగన్ కు ప్రత్యేకంగా ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇచ్చినట్లు అనిత వెల్లడించారు. గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఆయనకు రెండు ములాఖత్ లు మాత్రమే ఇచ్చి మూడో ములాఖత్ కు వెళ్లాలంటే అనుమతి ఇచ్చేవారు కాదన్నారు. జగన్ కు అనుమతి లేదని తెలిసీ అక్కడికి వెళ్లారంటే గలాటా సృష్టించాలన్న ఉద్దేశం ఉందన్నారు. దీనిపై తాను జైళ్ల ఐజీతో కూడా మాట్లాడానని అనిత తెలిపారు.












Click it and Unblock the Notifications