విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపి మంత్రి ఎదుట ఔట్ సోర్సింగ్ స్టాఫ్ ధర్నా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని 13 జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో బుధవారం జడ్పీ సమావేశం మందిరంలో సమీక్ష నిర్వహించారు.

హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న వారందర్నీ తొలగించడంతో వారు ధర్నాకు దిగారు. అన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న సిబ్బందిని డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కేవలం గృహ నిర్మాణ శాఖలోని సిబ్బందిని తొలగించడం అన్యాయమని తెలిపారు. అన్ని శాఖల మాదిరిగానే తమను కూడా కొనసాగించాలని ఆందోళన అనంతరం మంత్రి మృణాళినికి వినతి పత్రం అందజేశారు.

ఇది ఇలా ఉండగా హౌసింగ్ కార్పొరేషన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మంత్రి మృణాళినికి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

ఆందోళన

ఆందోళన

హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

ఆందోళన

ఆందోళన

రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని 13 జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో బుధవారం జడ్పీ సమావేశం మందిరంలో సమీక్ష నిర్వహించారు.

ఆందోళన

ఆందోళన

హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న వారందర్నీ తొలగించడంతో వారు ధర్నాకు దిగారు.

ఆందోళన

ఆందోళన

అన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న సిబ్బందిని డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కేవలం గృహ నిర్మాణ శాఖలోని సిబ్బందిని తొలగించడం అన్యాయమని తెలిపారు.

ఆందోళన

ఆందోళన

అన్ని శాఖల మాదిరిగానే తమను కూడా కొనసాగించాలని ఆందోళన అనంతరం మంత్రి మృణాళినికి వినతి పత్రం అందజేశారు.

ఆందోళన

ఆందోళన

హౌసింగ్ కార్పొరేషన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మంత్రి మృణాళినికి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

ఆందోళన

ఆందోళన

నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

English summary
AP housing corporation out sourcing staff protested on their problems at Minister Mrinalini in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X