చంద్రబాబు శుభవార్త.. వారి అకౌంట్లలోకి డబ్బులు

రాష్ట్రంలో చంద్రబాబు సారధ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం కొలువుతీరింది. చంద్రబాబు పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు కూడా తమ శాఖల్లో గతంలో ఏ పనులు జరిగాయి? ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులేంటి? నిధులు ఎంతమేరకు అవసరం? అనే లెక్కల్లో మునిగిపోయారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు చంద్రబాబు ప్రభుత్వం భారీ శుభవార్తను వినిపించింది. రానున్న వంద రోజుల్లో భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయబోతున్నట్లు తెలిపింది.

అధికారులతో సమీక్షిస్తాం..
రాష్ట్రంలో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలనే లక్ష్యాన్ని గృహ నిర్మాణ శాఖ నిర్దేశించుకుంది. ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది? అసంపూర్తిగా ఎందుకు మిగిలిపోయాయి? అందుకు కారణం ఎవరు? లబ్ధిదారులకు ఎందుకు అందడంలేదు? ఎక్కడ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు? తదితర వివరాలను సేకరించి ప్రతి మూడునెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష చేస్తానని గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలిపారు. ఆ సమీక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, అలసత్వం ప్రదర్శించేవారికి ఉపేక్షించమని హెచ్చరించారు.

ap housing department will complete 1 28 houses

లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం
ఏపీలో మార్చి పూర్తయ్యేసరికి 6.75 లక్షల ఇళ్లను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇవే కాకుండా 8.04 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గృహ నిర్మాణ శాఖకు అప్ లోడ్ అయిన బిల్లులకు త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బులు వేయబోతున్నారు. ఇంటి నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి 31వ తేదీలోపు అధికారులు నివేదిక తయారు చేయనున్నారు. అధికారులు అందుబాటులో లేనిచోట సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం ఉపయోగించుకోవడంతోపాటు అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+