విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AP INTER RESULTS 2022 : ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల- ఇలా చెక్ చేసుకోండి..

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఇవాళ విజయవాడలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఏడాది మే 6 నుంచి 25 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 9 లక్షలకు పైగా విద్యార్ధులు ఈ పరీక్షళకు హాజరయ్యారు. వీరిలో ఉత్తీర్ణులైన వారి వివరాలను ఇవాళ ప్రకటించారు.

ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ ఫలితాలు తెలుసుకోవాలనుకునే అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబర్లను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఫలితాలను ప్రభుత్వ వెబ్ సైట్లలో అధికారికంగా అందబాటులో ఉంచారు. అలాగే పలు ప్రైవేట్ వెబ్ సైట్లు కూడా ఫలితాలను అందిస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ఇంటర్ ఫలితాలను అందుబాటులో ఉంచిన వెబ్ సైట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

AP INTER RESULTS 2022 released : here is How to check your Results..

www.bie.ap.gov.in
www.examresults.ap.nic.in

http://www.manabadi.info/

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం రికార్డు స్ధాయిలో పరీక్షలు జరిగన 28 రోజుల్లోనే విడుదల చేసింది.ఫస్టియర్ పరీక్షలకు 4.45 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. సెకండియర్లో 4.23 లక్షల మంది పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ లో బాలురలో 49 శాతం, బాలికల్లో 60 శాతంమంది పాసయ్యారు. సెకండియర్ లో 54 శాతం బాలురు, 68 శాతం బాలికలు పాసయ్యారు. మొత్తం మీద బాలికలదే పైచేయి అయింది. ఫస్టియర్ లో 2.41 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ లెక్కన 54 శాతం మంది ఉత్తీర్ణులయినట్లయింది. సెకండియర్ లో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2.58 లక్షల మంది సెకండియర్ లో పాసయ్యారు.

English summary
AP Intermediate Results 2022 : ap intermediate exam results have been released today in vijayawada by education minisgter botsa satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X