ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ఈ సారి పరీక్షలు, పాస్ మార్కులు ఇలా..!!
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రథమ సంవత్సరంలో ప్రశ్నపత్రాల మోడల్ మార్పుతో పేజీల పెంచింది. విద్యార్థులకు 32 పేజీల సమాధాన పత్రాల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. తొలిసారి ఒకమార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. రెండు సబ్జెక్టుల్లో 29 మార్కులకే ఉత్తీర్ణత గా ఖరారు చేసారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి సెకండియర్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి వస్తుంది. అప్పుడు రెండో ఏడాది ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు చేస్తారు.
ఏపీ ఇంటర్ బోర్డు ఈ ఏడాది ఫస్టియర్‌లో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను అమలుచేయడంతో పాటు ప్రశ్నపత్రాలను మార్చారు. తొలిసారి ఒకమార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. ఫలితంగా ప్రశ్నల సంఖ్య పెరిగింది. గణితంలో గతంలో 150 మార్కులకు రెండు పేపర్లు ఉండగా ఈసారి వంద మార్కులకు ఒకటే పేపర్‌ను తీసుకొచ్చారు. దీంతో.. 32 పేజీల సమాధాన పత్రాల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాల సబ్జెక్టుల్లో 85 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీంతో సమాధానాల బుక్‌లెట్ పేజీలను పెంచారు. ఇప్పటివరకు 24 పేజీల బుక్‌లెట్ ఉండగా ఇకనుంచి 32 పేజీలది ఇస్తారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలు, చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, కామర్స్‌లకు 32 పేజీల బుక్‌లెట్ ఉంటుంది.

కాగా, జీవశాస్త్రంలో వృక్షశాస్త్రానికి 24 పేజీలు, జంతుశాస్త్రానికి 24 పేజీల చొప్పున రెండు బుక్ లెట్‌లిస్తారు. ప్రశ్నపత్రంలో ఏ, బీ సెక్షన్లుగా విడిగా వృక్ష, జంతుశాస్త్రాల ప్రశ్నలుంటాయి. విద్యా ర్థులు జవాబులను విడివిడిగా బుక్‌లెట్‌లలో రాయాలి. మిగతా సబ్జెక్టులకు గతంలో మాదిరిగానే 24 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులకు మొదటి ఏడాదిలో 85 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఉత్తీర్ణతకు 35% లెక్కన 29.75 మార్కులు రావాల్సి ఉండగా దీన్ని 29కి తగ్గించారు. ద్వితీయ సంవత్సరంలో 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన పెట్టారు. రెండు సంవత్సరాలకు కలిపి 35% కింద 59.5 మార్కులు సాధించాల్సి ఉండగా 59 మార్కులనే ఉత్తీర్ణతగా నిర్ణయించారు. అందులో భాగంగా ఈ అరమార్కును సర్దుబాటు చేసి, రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉత్తీర్ణత మార్కులను 10.5 నుంచి 11కు పెంచారు.
ఇక..తొలి ఏడాదిలో కొన్ని సబ్జెక్టుల్లో 30% మార్కులొచ్చినా ఉత్తీర్ణులే. మొత్తమ్మీద 35% రావాలి. ఏదైనా ఒక సబ్జెక్టులో అత్యధిక మార్కులు వచ్చి, మిగతా వాటిల్లో 30% చొప్పున వచ్చినా ఉత్తీర్ణు లు అయినట్లుగా పరిగణిస్తారు. జాగ్రఫీ పరీక్షను గతంలోలాగే 75 మార్కులకు నిర్వహించి, 85 మార్కులకు లెక్కిస్తారు. మొదటి ఏడాది 15, రెండో ఏడాది 15 కలిపి ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఛాయిస్ ఉండదు. వృక్షశాస్త్రం 43, జంతుశాస్త్రం 42 మార్కులకు ఉంటాయి. గ్రూపు ఐదు సబ్జెక్టులు కాకుండా ఆరో సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న దానిలో ఉత్తీర్ణత తప్పనిసరి కాదు. ఆరో సబ్జెక్టులో ఫెయిల్ అయినా ఐదు సబ్జెక్టుల మార్కులతో మెమో ఇస్తారు. ఒకవేళ ఉత్తీర్ణులైతే వేరేగా ప్రత్యేక మార్కుల మెమో ఇవ్వాలని నిర్ణయించారు.
-
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications