వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపి, బిజెపిలను ఏకేసిన పవన్ కల్యాణ్: బాబుపై సోము ఎదురుదాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి లేఖలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. టిడిపి, బిజెపి దాగుడు మూతలు ఎన్నాళ్లని ఆయన శనివారం ప్రశ్నించారు.

ఇదిలావుంటే, అమిత్ షా లేఖపై చంద్రబాబు శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబుపై ఆయన ఎదురు దాడి చేశారు. అమిత్ షా లేఖలో ప్రస్తావించిన అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.

రాష్ట్ర పరిస్థితి ఇదీ

రాష్ట్ర పరిస్థితి ఇదీ

హోదా ఇచ్చే స్థితిలో బిజెపి, సాధించే స్థితిలో టిడిపి లేవని అమిత్ షా, చంద్రబాబు లేఖలను బట్టి అర్థమవుతోందన పవన్ కల్యాణ్ అన్నారు. టిడిపి, బిజెపి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక ోదా తప్ప మరోటి వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ఆయన అన్నారు.

ఆ లెక్కలు చెప్పాలి

ఆ లెక్కలు చెప్పాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో కమిటీ వేసి నిధుల కేటాయింపు, ఖర్చులపై లెక్కలు తేల్చాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాజా పరిస్థితిపై వామక్షాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు రాజీనామా చేయాలి

చంద్రబాబు రాజీనామా చేయాలి

తనను రాజీనామా చేయాలని అడుగుతున్న టిడిపి నాయకులు ముందు బిజెపి మద్దతు, సహకారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో రాజీనామా చేయించాలని సోము వీర్రాజు అన్నారు అమిత్ షా లేఖపై టిడిపి బహిరంగ చర్చకు వస్తే ఆ లేఖలోని అంశాలపై మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

మాకు ఆ కర్మ లేదు

మాకు ఆ కర్మ లేదు

అబద్దాలు ఆడాల్సిన కర్మ బిజెపికి లేదని సోము వీర్రాజు అన్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.

మేం సిద్ధంగా ఉన్నాం

మేం సిద్ధంగా ఉన్నాం

అమిత్ షాకు చంద్రబాబు లేఖ రాస్తే మళ్లీ సమాధానం చెప్పడానికి బిజెపి సిద్ధంగా ఉందని సోము వీర్రాజు చెప్పారు కాంట్రాక్టర్లను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసారు. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్న టిడిపి నిజంగా తెలుగు డ్రామా పార్టీ అన్ి ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Jana Sena chief Pawan Kalyan has blamed BJP and Telugu Desam Party for the present Andhra Pradesh crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X