గూగుల్ డేటా సెంటర్ పై కర్నాటక ఏడుపే ఏడుపు..! లోకేష్ ఊహించినట్లే..!
ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో పొరుగు రాష్ట్రాలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా దేశ ఐటీ రాజధానిగా చెప్పుకునే పొరుగు రాష్ట్రం కర్నాటకకు ఇది తీవ్ర అవమానంగా మారింది. దీంతో కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే రగిలిపోతున్నారు. దీన్ని ముందే ఊహించిన ఏపీ ఐటీ మంత్రి, గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన నారా లోకేష్ నిన్నే ఓ ట్వీట్ చేశారు. ఇవాళ దానికి ఖర్గే బదులిచ్చారు.
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై స్పందిస్తూ నిన్న ఉదయం ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడంపై పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అలజడి మొదలైందని వెల్లడించారు. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ.. ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాని పొరుగు రాష్ట్రాలకు చురకలు అంటించారు.కొంతమంది పొరుగువారు ఇప్పటికే దాని భారాన్ని అనుభవిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbours are already feeling the burn! 🌶️🔥 #AndhraRising #YoungestStateHighestInvestment
— Lokesh Nara (@naralokesh) October 16, 2025
దీనిపై కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఎన్నో ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇన్ని ఇస్తే ఏ రాష్ట్రమైనా ఈ ప్రాజెక్టును దక్కించుకుంటుందని తన ఆవేదన వెళ్ళగక్కారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ లోకేష్ ట్వీట్ కు పరోక్షంగా రిప్లై అన్నట్లుగా ఓ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో కాస్తంత ఘాటును ఆస్వాదిస్తామని, కానీ పోషకాహార నిపుణులు సమతుల్య ఆహారాన్ని సిఫార్సు చేసినట్లే, ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్‌ను సమర్థిస్తారన్నారు.

Everyone enjoys a bit of spice in their food, but just as nutritionists recommend a balanced diet, economists too advocate a balanced budget.
— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) October 17, 2025
The neighborurs total liabilities have now ballooned to nearly ₹10 lakh crore.
In just one year, they have borrowed over ₹1.61 lakh…
పొరుగువారి (ఏపీ) మొత్తం అప్పులు ఇప్పుడు దాదాపు ₹10 లక్షల కోట్లకు పెరిగాయని, కేవలం ఒక సంవత్సరంలో, వారు ₹1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారని, జీఎస్టీడీపీలో ఆదాయ లోటు మరింత దిగజారి, 2.65% నుండి 3.61%కి పెరిగిందన్నారు. ఏమి చెప్పినా, చేసినా, మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటామన్నారు. "పొరుగువారి అసూయ మరియు యజమాని గర్వం." అంటూ నిర్వేదంగా ముగించారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications