Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Opinion: ఏపీలో భూహక్కు చట్టం గేమ్ ఛేంజర్ అవుతుందా ? నిపుణులేమంటున్నారు ?

ఏపీలో ఎన్నికల వేళ భూహక్కు చట్టం మీద వైసీపీ వర్సెస్ విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేంద్రం తెచ్చిన ఈ చట్టంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ వాదిస్తుండగా.. విపక్షాలు మాత్రం భూములపై జనానికి యాజమాన్య హక్కును దూరం చేయడానికే దీన్ని తెచ్చారని ఆరోపిస్తున్నాయి.ఈ క్రమంలో భూ హక్కు చట్టం రాకముందు అంటే ప్రస్తుత పరిస్ధితులేంటి, ఈ చట్టం వచ్చాక జరిగే ప్రయోజనం ఏంటన్న దానిపై నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ విధానం ఇంకా కొనసాగుతోంది. అయితే దీని ప్రకారం మనం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తే మన ఆధార్ కార్డు మన ఫోటో తీసుకొని అమ్మే వాళ్లకు కొనేవాళ్లకు అబ్జెక్షన్ ఉందా లేదా అని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అంటే కాగితాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కానీ హక్కులను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు కానీ ప్రభుత్వం దానికి ఎలాంటి బాధ్యత వహించదు.

ap land titling act 2024 really beneficial for people what experts say

దీంతో ఒక్కోసారి ఆస్తిపత్రాలు మన దగ్గర ఉన్నా కానీ అవి నకిలీవి సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్లు లేకపోతే మనకు తెలియకుండానే మన భూమి వేరే వాళ్ల పైన రిజిస్టర్ కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్ధితుల్లో ఎన్ కంబరెన్స్ (ఈసీ) సర్టిఫికెట్ తీసుకోవడమో లేక లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడమూ చేస్తుంటాం. కానీ తీరా ఆ భూమి కొన్నాక అది ప్రభుత్వ భూమి అనో లేక ఎవరికైనా ఇచ్చేసిన భూమి అనో తెలిస్తే ఏమీ చేయలేక కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. చట్టంలో లొసుగులే ఇందుకు కారణం.

ఇప్పుడు కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్న భూహక్కు చట్టం మన స్ధలంపైన ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోటికి తెస్తుంది. సదరు భూమికి సంబంధించిన చరిత్ర అంతా ఒకే చోట ఉంటుంది. దీనికోసం ముందుగా మన స్థలాలను పొలాలను జియో ట్యాగింగ్ విధానం ద్వారా సర్వే చేసి దానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు. తర్వాత కంప్యూటరైజేషన్ చేసి దానికి ఉన్న ఎంకంబరెన్స్ సర్టిఫికెట్, లింక్ డాక్యుమెంట్లు, రెవెన్యూ, ఎండోమెంట్స్ ఇలా ఎన్నో డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న సమాచారం అంతా లింక్ చేస్తారు. అలాగే ఏవైనా కోర్టు కేసులు, డబుల్ రిజిస్ట్రేషన్ లో ఉన్నా ఇందులో తెలిసిపోతుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ భూమి లేక స్థలానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర అంతా ఆ డాక్యుమెంటులో, కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఏ రికార్డులో ఎక్కడైనా మార్పు జరిగితే అది ఇక్కడ మార్పు మారిపోతుంది . దీన్ని మిర్రర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఈ చట్టం థ్యేయం ఇదే. గతంలోలా రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపు కోకుండా, ఈ కొత్త చట్టంలో ఆ మేరకు రక్షణ లభిస్తుంది. అందులో ఏ సమస్య వచ్చినా ఇన్సూరెన్స్ కూడా చేసి ఉంటుంది.

అలాగే ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే దేశంలో ఏ భూమి వివరాలు అయినా తెలుసుకోవచ్చు. దాదాపు 16 భాషలలోకి అవి ఆటోమేటిక్గా తర్జుమా అయ్యి కనిపిస్తాయి. కేంద్రం తెస్తున్న ఈ చట్టం విప్లవాత్మకమైనది. ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది.కబ్జాదారులకు, పెట్టుబడిదారులకు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్లకు ఇది ఇబ్బందికరంగా మారుతోంది.
ఏపీలో ఇప్పటికే భూముల జియో టాగింగ్ లాంటివి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. భూహక్కు చట్టం అసెంబ్లీలో ఆమోదించారు. కానీ ఇంకా అమల్లోకి రాలేదు.

( వ్యాసకర్త- బాపట్ల అడ్వకేట్ మొహమ్మద్ ఖాజా )

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+