AP Local Polls: కూటమికే ఎందుకు ఓటేయాలంటే?- చంద్రబాబు, పవన్, మాధవ్ కామెంట్స్..!

ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Polls) తమను అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్ మీట్లో కోరారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు కోరారు. ప్రభుత్వ పాలనలో సమర్ధవంతంగా సేవలు అందించేలా సంస్కరణలు తీసుకువచ్చామని, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని గుర్తుచేశారు. గతంలో వైసీపీ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం వేసిందని, తాము ఛార్జీలు పెంచకుండా తొలిసారి ట్రూ డౌన్ చేశామన్నారు.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులకు ఊరట-ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులకు ఊరట-ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!

బటన్ నొక్కుతున్నాం గుంతలు పూడ్చలేమని గత పాలకులు చెప్పారని, తాము సంక్షేమం అందించాం, అభివృద్ధి చేస్తున్నాం, రోడ్లు కూడా వేసి చూపించామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి డేటా సెంటర్ల వరకూ అభివృద్ధి చేశామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లుగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద రూ.27 వేల కోట్లతో మరో ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టామన్నారు. రూ.1.30 లక్షల కోట్ల విలువైన పనులు గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్నామని, రాయలసీమ గ్లోబల్ హార్టీ కల్చర్ అభివృద్దిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు కూడా అభివృద్ది జరుగుతుందన్నారు.

AP Local Polls Chandrababu Pawan Kalyan and PVN Madhav Seek Votes on Development Agenda
మరోవైపు స్థానిక సంస్థల్లో ఐక్యంగా కూటమి పార్టీలు ముందుకు వెళ్తున్నాయని, పెద్ద ఎత్తున నామినేషన్లు అన్ని పార్టీల నుంచి దాఖలయ్యాయని డీసీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చాయని, ఆ దిశగానే క్షేత్ర స్థాయిలోనూ అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కొంచెం క్లిష్టతరంగా ఉంటుందన్నారు. కూటమి స్పూర్తిని చాటేలా స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లు పవన్ తెలిపారు. చాలా మంది పోటీలో ఉన్నా.. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు తనకున్న సుదీర్ఘ అనుభవంతో సీట్ల సర్దుబాటు విషయంలో చాలా మంచి కసరత్తు చేశారని, స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని వాళ్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. చేసుకున్న సీట్ల సర్దుబాటు ప్రకారం కూటమి పార్టీలు ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని పవన్ కోరారు.
AP Local Polls Chandrababu Pawan Kalyan and PVN Madhav Seek Votes on Development Agenda
జగన్ - షర్మిల వివాదంపై స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!
జగన్ - షర్మిల వివాదంపై స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!

చివరిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల్లో ఏం చెప్పామో... అది చేశాం.. ఇంకా చేస్తున్నామన్నారు. కూటమి పార్టీల అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+