పవన్ కళ్యాణ్ ఉదాసీనతే కారణమా: వైసీపీ బీఫారంల కమిటీలో రాపాక: బీజేపీతో పొత్తుపై ఎఫెక్ట్..!

అమరావతి: జనసేన ఏకైక ఎమ్మెల్యే తీరు ఇప్పుడు పవన్ సమర్ధతకు ప్రశ్నగా మారుతోంది. 2019 ఎన్నికల్లో జనసేన నుండి రాజోలు ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఎన్నికయ్యారు. తొలుత పార్టీ లైన్ లోనే పని చేసిన రాపాక కాల క్రమేణా అధికార పార్టీకి దగ్గరయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు భిన్నంగా ముఖ్యమంత్రిని పలు సందర్భాల్లో అటు అసెంబ్లీలో..ఇటు బయటా మద్దతిస్తున్నారు. ఇక, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఆయన అధికార పార్టీకి సేవలిందిస్తున్నారు.

జనసేన అభ్యర్ధులను బరిలోకి దింపి గెలిపించే బాధ్యతలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యే ఏకంగా అధికార వైసీపీ బీఫారంల కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అభ్యర్ధులను బీఫార్మ్ లు అందిస్తున్నారు. వైసీపీ అభ్యర్ధులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది..ఇప్పుడు జనసేన..బీజేపీ బంధం పైనా ఎఫెక్ట్ పడుతోందని జనసైనికులు వాపోతున్నారు.

 వైసీపీ బీఫార్మ్ కమిటీలో రాపాక...

వైసీపీ బీఫార్మ్ కమిటీలో రాపాక...

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఇప్పుడు పార్టీ అధినేత పవన్ కు పరీక్షగా మారారు. స్థానిక సంస్థల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేనకు తూర్పు గోదావరిలో కొందరు నేతల తీరు సమస్యగా మారుతోంది. ఇదే సమయంలో పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్థానిక సంస్థల్లో తమ పార్టీ కోసం కాకుండా..అధికార వైసీపీ కోసం పని చేస్తున్నరంటూ జనసైనికులు మండిపడుతున్నారు.

రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధులకు బీఫారంలు అందించే కమిటీలో రాపాక సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అమలాపురం వైసీపీ ఎంపి చింతా అనూరాధ..రాజోలు వైసీపీ ఇన్ ఛార్జ్ పెదపాటి అమ్మాజీతో..వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావుతో పాటుగా వైసీపీ ఎన్నికల పరిశీలకులతో పాటుగా రాపాక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం అటు వైసీపీలో..ఇటు జనసేనలోనూ హాట్ టాపిక్ గా మారింది. దీని పైన స్థానిక జనసేన..బీజేపీ నేతలు తమ అధినాయకత్వానికి ఫిర్యాదులు పంపారు.

పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు...

పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు...

ఇప్పుడు తమ సొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక తీరు పవన్ కళ్యాణ్ కు సమస్యగా మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా అధికార పార్టీ అభ్యర్ధు ల కోసం పని చేయటం సమస్యగా మారుతోంది. దీంతో..రాపాక పైన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. స్థానిక వైసీపీ నేతలతో కలిసి వైసీపీ అభ్యర్ధులకు దిండి ఏపీ టూరిజం రిసార్ట్స్ లో కమిటీ సభ్యులు బీ ఫారం లను అందిస్తున్నారు.

Recommended Video

    AP Local Body Elections: Janasena Bjp Manifesto బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనా ?
     రాపాక పై చర్యలు తీసుకుంటారా..?

    రాపాక పై చర్యలు తీసుకుంటారా..?

    రాపాక ఇంత ఓపెన్ గా అధికార పార్టీకి మద్దతిస్తున్నా..ఆయన పైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదనే చర్చ పార్టీలో మొదలైంది. అయితే, ఈ రోజు జనసేన అధినేత పవన్ రాజమహేంద్ర వరం పర్యటనకు వస్తున్నారు. ఈ సమయంలోనే రాపాక వ్యవహారం పైన ఆయనతో చర్చించాలని జిల్లా జనసేన నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో ఇక పవన్ తమ ఎమ్మెల్యే తీరు పైన ఉపేక్షించే పరిస్థితులో లేరని..ఖచ్చితంగా చర్యలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+