కేంద్ర పన్నుల్లో ఏపీకి దక్కేదెంత - విశాఖ ప్లాంట్ కు కేటాయింపులు : ఇంతే సంగతులు..!!

కేంద్ర బడ్జెట్ ఏపీకి ఏమిచ్చింది. సాధారణంగా కేంద్ర బడ్జెట్ తరువాతనే ఏపీకి వచ్చే ఆర్దిక సంవత్సరం లో కేంద్ర నిధుల వాటా పైన అంచనాలు వస్తాయి. ఈ ఏడాది సైతం కేంద్రం ప్రతిపాదించిన అంచనాలతో ఏపీకి ఎంత మేర వాటా దక్కనుందనే దాని పైన అధికారులు లెక్కలు వేసారు. అందులో..బడ్జెట్ లో ప్రయివేటకరణ ఖాయమంటూ చెబుతూనే... విశాఖ స్టీల్ ప్లాంట్ అయిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కు కేంద్రం బడ్జెట్ లో రూ 910 కోట్లు కేటాయించింది. విశాఖలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, ఎనర్జీ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, వైజాగ్‌ పోర్టు ట్రస్టుకు రూ.207 కోట్లు కేటాయించారు.

కొంత మేర పెరిగిన పన్నుల వాటా

కొంత మేర పెరిగిన పన్నుల వాటా

కాగా, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గత బడ్జెట్‌తో పోలిస్తే పెరిగింది. గత బడ్జెట్‌లో రూ.30,356.31 కోట్లు వస్తే.. ఈ సారి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు రానుంది. దీంట్లో కార్పొరేషన్‌ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్‌ జీఎస్టీ రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్‌ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ రూ.33.18 కోట్లు రానున్నాయి. ఇవి ప్రతీ ఏటా కేంద్ర పన్నుల వాటాలో భాగంగా హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. అంతకు మించి ఏపీకి ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు లేవు.

ఏపీ ఆర్దికంగా కష్టాల్లో ఉన్నా

ఏపీ ఆర్దికంగా కష్టాల్లో ఉన్నా

ఈ సారి బడ్జెట్ పైన తెలుగు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని మాత్రం వ్యాఖ్యానించింది. గత బడ్జెట్ల సమయంలో కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టం మేరకు కేటాయించిన సంస్థలకు ఎంతో కొంత కేటాయింపులు చూపించేది.

ఈ సారి.. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ 56.66 కోట్లు కేటాయించారు. ఇరు రాష్ట్రాల్లో గిరిజన విశ్వ విద్యాలయాలకు రూ 44 కోట్లు ఇచ్చారు. వీటికి గత బడ్జెట్ లో రూ 53.80 కోట్లు కేటాయించగా.. అంచనాల తరువాత రూ 13..7 కోట్లకు తగ్గింది. విశాఖ పోర్టు ట్రస్టుకు రూ 207.99 కోట్లు కేటాయించారు.

కేంద్ర సంస్థలకు నిధులేవీ

కేంద్ర సంస్థలకు నిధులేవీ

2021-22 లో రూ 290 కోట్లుగా పేర్కొన్నా.. అంచనాల సవరణ సమయానికి రూ 104.70 కోట్లకు తగ్గిపోయింది. విశాఖ పెట్రోలియం యూనివర్సిటీకి రూ 150 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం మంజూరు చేసిన రూ 95 కోట్లను పూర్తిగా ఖర్చు చేసారు. సింగరేణి కాలరీలకు రూ 2 వేల కోట్లు కేటాయింపులు చేసారు.

ఇక, జాతీయ విద్యా సంస్థల విషయంలో దేశ వ్యాప్తంగా కలిపి నిధులు ప్రకటించారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలకు ఏ మేర అందులో కేటాయింపులు జరిగాయనేది స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా ప్రతీ ఏటా కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా మినహా.. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా చేసిన కేటాయింపులు లేవు.

Recommended Video

    PRC Issue In AP: పదవీ విరమణ వయస్సు పెంపు.. Govt - ఉద్యోగ సంఘాల మధ్య ప్రతిష్ఠంభన | Oneindia Telugu
    రెవిన్యూ లోటు.. వెనుకబడిన జిల్లాల ప్రస్తావనే లేదు

    రెవిన్యూ లోటు.. వెనుకబడిన జిల్లాల ప్రస్తావనే లేదు

    ఏపీ ఆశించిన రెవిన్యూ లోటు భర్తీ... వెనుక బడిన జిల్లాల నిధుల గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. ఈ బడ్జెట్ ప్రతీ ఏడాది చెప్పినట్లుగా ఈ సారి ఏపీకి చెందిన రాజకీయ నేతలు ఆశాజనకంగా లేదు.. తమ వంతు పోరాటం చేస్తాం.. సాధిస్తాం అనే మాటలు మినహా... కేంద్రం మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక, ఆర్దిక కష్టాల్లో ఉన్న ఏపీకి ఈ సారి బడ్జెట్ ఏ మాత్రం ఉపశమనంగా లేదనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న అంశం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+