• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హోటళ్లలో నాన్ వెజ్ తింటున్నారా?...అయితే ఇది ఒక్కసారి చదవాల్సిందే!

By Suvarnaraju
|

భోజన ప్రియుల్లో నాన్ వెజ్ లవర్స్ తీరే వేరు...వారికి ఎంత రుచికరమైన...ఎన్ని రకాల శాఖాహార వంటకాలు పెట్టినా ...నీచు తగలక పోతే పెదవి విరిచేస్తారు. అంతేకాదు తామిష్టపడే మాంసాహార వెరైటీల కోసం వివిధ రకాల హోటళ్లకు వెళ్లి హాట్ హాట్ గా నాన్ వెజ్ డిష్ లు లాగిస్తుంటారు.

అయితే అలాంటి వాళ్లందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని ఎపి మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ హెచ్చరిస్తోంది. ఇటీవల కాలంలో వివిధ హోటళ్లను, మాంసం అమ్మే దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్న ఈ కార్పోరేషన్ చైర్మన్‌ ప్రకాష్‌ నాయుడు తన పరిశీలనలో తేలిన భయంకర నిజాల గురించి అప్రమప్తంగా ఉండాల్సిందిగా మాంసాహార ప్రియులను హెచ్చరిస్తున్నారు...ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే...చదివేయండి మరి!...

ఆ మాంసం...ఫ్రెష్ కాదు...

ఆ మాంసం...ఫ్రెష్ కాదు...

కొన్నిహోటళ్లలో మీరు ఎంతో ఇష్టపడి లొట్టలు వేసుకొని తినే మాంసాహార వంటకాలు తాజావి కాకపోవడానికే ఎక్కవ ఛాన్స్ ఉందని మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌ ప్రకాష్‌ నాయుడు అంటున్నారు. బహుశా అక్కడ మీరు శనివారం హోటల్ లో నాన్ వెజ్ తింటుంటే మీరు తినే వంటకానికి వినియోగించిన మాంసం అంతకుముందు ఆదివారం కొనుగోలు చేసినది అయి ఉండవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభ్యం, విడిరోజుల్లో లభ్యత దుర్లభం కావడం ఇత్యాదికారణాలతో కొన్ని హోటళ్ల నిర్వాహకులు ఆదివారం టు ఆదివారం పద్ధతిలో మాంసం కొనుగోళ్లు, వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరులో...తనిఖీల్లో తేలిందిదే

గుంటూరులో...తనిఖీల్లో తేలిందిదే

ఆదివారం నగరంలో పలుచోట్ల ఎపి మాంసం అభివృద్ధి కార్పొరేషన్‌, జీఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు చేసిన తనిఖీల్లో అనేక చోట్ల భారీగా నిల్వ ఉంచిన, బూజుపట్టిన మాంసం బయట పడడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. మటన్‌, రొయ్య, చేప వంటి మాంసాహారాన్ని హోటల్‌ నిర్వాహకులు ఆదివారం టు ఆదివారం పద్ధతిలో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో పలు మాంసం విక్రయదారులు ఆదివారం తాజాగా చేపలు, మటన్‌ విక్రయిస్తారు. మిగిలిన రోజుల్లో బడా వ్యాపారులు మినహాయిస్తే చిన్న వ్యాపారులెవ్వరూ వీటిని విక్రయించరు. దీంతో ఆదివారం రోజునే ఎక్కువమంది హోటల్‌ నిర్వాహకులు తమకు వారానికి సరిపడా మాంసాన్ని తీసుకువెళ్లి ఫ్రిజ్‌ల్లో నిల్వ ఉంచుకుంటున్నారు. అలా వాటినే రోజుల తరబడి వండి వారుస్తున్నారు.

అనారోగ్యం...ఏం చెయ్యాలో తెలియక

అనారోగ్యం...ఏం చెయ్యాలో తెలియక

అలా వాటినే రోజుల తరబడి వండి వారుస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో ఈ మాంసం మరీ పాడైపోయి ఓ రకమైన వాసన రావడంతో పాటు ఈ మాంసంతో తయారైన వంటకాలు తిని అనేకమంది వాంతులు, విరోచనాలు, ఇతర రోగాల బారిన పడుతున్నారు. ఒక్క చికెన్‌ మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల మాంసాహారాలు ఎక్కువగా నిల్వ ఉంచినవే సరఫరా అవుతుంటాయని కొందరు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని అయోమయస్థితిలో కొందరు ఏకంగా బైట మాంసాహార పదార్థాలు భజించడమే మానేస్తున్నారు. తెలియని వారు మాత్రం వాటిని ఆర్డర్‌ చేసి రోగాలు కొని తెచ్చకుంటున్నారు.

చచ్చిన వాటి...కొనుగోలుకే మొగ్గు

చచ్చిన వాటి...కొనుగోలుకే మొగ్గు

చేపల మార్కెట్ లో కూడా హోటళ్ల నిర్వాహకులు చనిపోయిన చేపలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతారని అంటున్నారు. వీటి ధర బాగా తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మార్కెట్లో బతికి ఉన్న చేపకు, చనిపోయిన చేపకు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు తేడా ఉండటంతో చనిపోయిన చేపలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. చనిపోయి ఎక్కువ సమయం అయిన చేపలు వంటకు వినియోగించడం వల్ల అది అనారోగ్యాలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇవేమీ పట్టించి కోకుండా హోటల్‌ నిర్వాహకులు లాభాపేక్షే ధ్యేయంగా నిల్వ మాంసాన్ని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది చికెన్ కు కూడా వర్తిస్తుందంటున్నారు.

మరి తనిఖీలు...తూతూ మంత్రమే

మరి తనిఖీలు...తూతూ మంత్రమే

మరి హోటళ్ల నిర్వాహకులు ఇంత ఘోరంగా పాడైపోయినవాటిని వండి వారుస్తుంటే ఆహార కల్తీ నియంత్రణ అధికారుల తనిఖీలు చేయరా అంటే చేస్తారు. అయితే అవి నామ్ కే వాస్తిగా...తూతూ మంత్రంగా ఉంటున్నాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అధికారులు, సిబ్బంది కొరతతో సంబంధిత అధికారులు హోటళ్ల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించడం, మామూళ్ల మత్తులో జోగుతుండటం చేస్తారు. ఫలితంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల నిర్వాహకుల్లో ఎక్కువమంది పాడైపోయిన నాన్ వెజ్ తో వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు తేలింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur:AP Meat Development Corporation Chairman Prakash Naidu conducted raids on hotels, restaurants, fastfood centres in Guntur city. In these inspections, they found a large quantity of damaged meat in a large quantity. In this background Special warnings have been issued by them to customers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more