డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్
నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితా శుక్రవారం రాత్రి విడుదలయ్యింది. డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లలో ఈ జాబితాను అందుబాటులో ఉంచారు, అభ్యర్థులు అక్కడి నుంచే సమాచారం పొందాలని అధికారులు సూచించారు.
నియామక ప్రక్రియలో తదుపరి దశకు ఎంపికైన 'జోన్ ఆఫ్ కన్సిడరేషన్' అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందుతుందని అధికారులు తెలిపారు. ఈ కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. ఇందుకోసం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, మరియు ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో వ్యక్తిగతంగా హాజరు కావాలని కన్వీనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి ముందే తమ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. సర్టిఫికెట్ల పరిశీలన కోసం అవసరమైన పత్రాల చెక్‌లిస్ట్‌ను డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరు కాకపోయినా లేదా సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోయినా, వారి తరువాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications