ఏపీలో పవన్ మద్దతు తీసుకుంటూ-తెలంగాణలో మద్దతివ్వరా ? టీడీపీకి అంబటి ప్రశ్న..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీపైనా పడుతోంది. ముఖ్యంగా నిన్న ఎగ్జిట్ పోల్స్ లో అధికార బీఆర్ఎస్ ను కాదని విపక్ష కాంగ్రెస్ పార్టీకి అక్కడి ఓటర్లు మద్దతిచ్చారని దాదాపుగా తేలడంతో ఏపీలో వైసీపీ నేతలు దానికి కారణమైన టీడీపీ వంటి పార్టీల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ టీడీపీ ద్వంద వైఖరిపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిచ్చోడంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతిచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు.. అక్కడ కాంగ్రెస్ కు మద్దతిచ్చింది టీడీపీ కాదని కుల సంఘాలు మద్దతు ఇచ్చాయని తెలిపారు.తెలంగాణాలో టీడీపీ కుల సంఘాల చర్యల వల్ల ఏపీ లో టీడీపీ కూకటి వేళ్ళు పెకలించచబోతున్నారంటూ అంబటి వ్యాఖ్యానించారు. దీనికి గల కారణాల్ని కూడా ఆయన వివరించారు.

ap minister ambati rambabu asks why not tdp support janasena in ts polls despite tie-up in andhra

చంద్రబాబు ను అరెస్టు చేస్తే ఏపీలో ఏ నాయకుడు వెళ్ళలేదని, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే వెళ్ళాడని అంబటి తెలిపారు. టీడీపీ కి అండగా ఉంటానని పిచ్చి పవన్ కళ్యాణ్ ప్రకటించాడన్నారు. తెలంగాణలో పవన్ 8 సీట్లకు పోటీ చేస్తే చంద్రబాబు కానీ ఆయన సామాజిక వర్గం ఎందుకు మద్దతివ్వలేదని అంబటి ప్రశ్నించారు. తెలంగాణ లో పవన్ ఓడిపోవాలి ఏపీలో మాత్రం గెలవాలా అని ఆయన ప్రశ్నించారు. అక్కడ పవన్ వద్దు..ఇక్కడ కావాలా అని టీడీపీని ఆయన నిలదీశారు. తెలంగాణ లో పవన్ ను ఓడిస్తారు కానీ ఏపీలో మాత్రం పవన్ వారికి మద్దతు పలకాలా అని అడిగారు. ఇదా రాజకీయం అని అంబటి ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+