కాపులూ.. సీఎం సీఎం అని అరిచారుగా.. ఇప్పుడేమైందన్న మంత్రి అంబటి ..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యాయి. ఎన్డీయే కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రెండు రోజులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో జరిపిన చర్చలు ఫలించడంతో ఇవాళ ఢిల్లీ నుంచి సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా తాజా పరిణామాలపై స్పందిస్తున్నారు.
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ పై, జనసేన పార్టీపై నిత్యం విరుచుకుపడే వైసీపీ మంత్రి అంబటి రాంబాబు తాజా పొత్తులపై వ్యంగంగా స్పందించారు. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ ను సీఎం.. సీఎం అంటూ అరిచిన కాపులు ఇప్పడేమంటారని ఆయన ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎక్స్ లో మంత్రి అంబటి ఇవాళ ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తున్న కాపుల్ని టార్గెట్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు.

సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా.. సీఎం అంటే ఛీఫ్ మినిస్టరా ?, సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా ? సీఎం అంటే చంద్రబాబు మనిషా ?, సీఎం అంటే చీటింగ్ మనిషా ? అని అంబటి రాంబాబు వరుస ప్రశ్నలు సంధించారు. ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటూ వస్తున్న కాపులంతా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ఏమని అర్దం చేసుకుంటున్నారని అంబటి వారిని ప్రశ్నించారు. దీనిపై ఎక్స్ లో జనసైనికులు ఘాటుగానే స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications