కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు: వైఎస్ జగన్ పాలనతో కంపేర్ చేస్తూ చురకలు

|
Google Oneindia TeluguNews

కర్నూలు: జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలు సంధించారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లిన సమయంలో చంద్రబాబు, ఇతర పార్టీ నాయకులు టీడీపీ జెండాలను ప్రదర్శించడాన్ని తప్పు పట్టారు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లినట్టు లేదంటూ ఎద్దేవా చేశారు.

ఈ ఉదయం ఆయన శ్రీశైలంలో పర్యటించారు. కృష్ణానదికి సంభవించిన వరదల వల్ల శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లను ఎత్తారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి వరద బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు పార్టీ జెండాలను కట్టుకుని వెళ్లారని గుర్తు చేశారు. ఇది ఆయనకు సిగ్గుచేటుగా అనిపించట్లేదా అంటూ నిలదీశారు.

 AP Minister Ambati Rambabu slams TDP Chief Chandrababu Naidu during his Srisailam visit

తమ ప్రభుత్వంపై బురద చల్లడానికే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తోన్నార‌ంటూ మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, ఈ సంవత్సరం కూడా శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుందని అన్నారు. చంద్రబాబు పాలనలో వర్షాలు పడటం గానీ, గేట్లు ఎత్తడం గానీ జరగలేదని గుర్తు చేశారు. నదులు వరదనీటితో పోటెత్తుతున్నాయని, అన్ని ప్రాజెక్టులు నిండాయని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే ప్రధాన కారకుడని ధ్వజమెత్తారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ ఎవరైనా నిర్మిస్తారా?.. అంటూ నిలదీశారు. కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాతే డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు పదేపదే చెప్పినప్పటికీ.. పట్టించుకోలేదని అంబటి రాంబాబు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలోనే పనులు వేగంగా పూర్తి కొనసాగుతున్నాయని చెప్పారు.

శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణా, తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్ల శుక్రవారం నాటికి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. 1.92 లక్షల క్యూసెక్కుల వరదనీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. రాత్రికి నీటిమట్టం 881.30 అడుగులకు చేరింది. దీనికి అనుగుణంగా ఇన్‌ఫ్లో మరింత అధికంగా ఉన్న నేపథ్యంలో గేట్లను ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఉదయం మూడు గేట్లను ఎత్తేశారు.

English summary
AP Minister Ambati Rambabu slams TDP Chief Chandrababu Naidu during his Srisailam visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X