Cockroach Janta Party: భారత్ లో మరో జెన్ జీ ఉద్యమం ? ఏం జరగబోతోంది ?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతలోని కొందరు యువతను ఉద్దేశించి చేసిన బొద్దింక వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ దిప్కే (Abhijeet Dipke) అనే యువకుడు ప్రారంభించిన ఆన్ లైన్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party). దీన్ని ప్రారంభించిన గంటల వ్యవధిలోనే దేశంలోని మిలియన్ల మంది యువతను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, వ్యవస్థలు నిరుద్యోగుల్ని, ఈ దేశ యువతను అవమానిస్తున్న తీరుకు నిరసనగా ప్రారంభించిన ఈ బొద్దింకల పార్టీకి సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీపై రాజకీయ పార్టీలూ స్పందిస్తున్నాయి.
అయితే ఈ క్రమంలో గతంలో మన పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ లో దాదాపు ఇలాంటి కారణాలతోనే తలెత్తిన జెన్ జీ ఉద్యమాలకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ తొలి అడుగా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే ప్రశ్నను కొందరు జర్నలిస్టులు పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ దిప్కేకు సంధిస్తున్నారు. దీంతో ఆయన జెన్ జీ యువతను అంత తక్కువ చేసి చూడొద్దని కోరుతూ ఎక్స్ లో సుదీర్ధ వివరణ ఇచ్చారు. నేపాల్, బంగ్లాదేశ్ లో జరిగిన జెన్ జీ ఉద్యమాలకూ, దీనికి అస్సలు పోలిక లేదన్నాడు.

Many journalists have been asking me whether this GenZ movement will turn into what happened in Nepal or Bangladesh.
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 19, 2026
Let me make this absolutely clear. Do not insult or underestimate the GenZ of India by making such comparisons. The youth of this country are far more mature,…
ఈ జెన్-జెడ్ ఉద్యమం నేపాల్ లేదా బంగ్లాదేశ్‌లో జరిగినట్లుగా మారుతుందా అని చాలా మంది పాత్రికేయులు తనను అడుగుతున్నారని అభిజిత్ దిప్కే తెలిపారు. ఒక విషయం తాను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని, అటువంటి పోలికలు చేస్తూ భారతదేశంలోని జెన్-జెడ్‌ను అవమానించకండి లేదా తక్కువ అంచనా వేయకండని వారికి సూచించారు. చాలా మంది అనుకున్నదానికంటే ఈ దేశ యువత చాలా పరిణతి, అవగాహన, రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. వారు తమ రాజ్యాంగ హక్కులను అర్థం చేసుకున్నారని, శాంతియుత, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తారని తెలిపారు. దయచేసి, వారిని కించపరచొద్దన్నాడు. ఈ యువతలో చాలా మంది ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి కంటే చాలా ఎక్కువ విద్యావంతులు, విషయ పరిజ్ఞానం కలవారని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications