రాజధాని తరలింపు ఇలా- చంద్రబాబు, లోకేష్ అడ్రస్ ఏదీ ? రాజమండ్రిలో బొత్స వ్యాఖ్యలు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటిదాకా ఎలాంటి ముందడుగూ పడటం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం తరఫున రాజధానిపై వకాల్తా పుచ్చుకుంటున్న మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తరచూ రాజధాని తరలింపు ఎప్పుడు, ఎలా అనే అంశాలపై స్పష్టత ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ రాజమండ్రిలోనూ ఆయన మరోసారి రాజధానిపై స్పందించారు.
ఏపీ రాజధాని విశాఖ తరలింపు ఖాయమని, ఇందులో ఉన్న సాంకేతిక సమస్యలపై కోర్టుల్ని ఒప్పిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ రాజమండ్రిలో తెలిపారు. దీంతో రాజధాని తరలింపుపై సాంకేతిక సమస్యలు ఉన్నట్లు ప్రభుత్వం ఒప్పుకున్నట్లయింది. మరోవైపు రాష్ట్రంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని బొత్స ఆరోపించారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను బొత్స టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు.

Recommended Video
చంద్రబాబు, లోకేష్ కు అడ్రస్ ఎక్కడ ఉందని మంత్రి బొత్స ప్రశ్నించారు. తనకూ అడ్రస్ వుందని,.. ఆయనకు వుందా..అని చంద్రబాబును ఉద్దేశించి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు కూ, లోకేష్ కూ ఇళ్ళులెక్కడ వున్నాయని అడిగారు. రాష్ట్ర ప్రజలకోసమే పనిచేస్తున్నామంటూ పక్క రాష్ట్రంలో వుంటారా అని నిలదీశారు. చంద్రబాబును తన ఇల్లు ఎక్కడవుందో చెప్పమనండి అని బొత్స సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో వుండగానే జగన్ తాడేపల్లి లో ఇల్లు ఏర్పాటు చేసుకున్నారని, కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఉన్నారన్నారు. ఆయన మాకు నీతులు, సుద్దులు చెబుతారా అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కౌలు రైతులకు ముందుగానే కౌలు చెల్లిస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా బొత్స చెప్పారు. రాజధాని తరలింపుకు సంబంధించి ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే ఆయన పలుమార్లు కోర్టుల్ని ఒప్పించే రాజధాని తరలిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది.
-
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications