పవన్ వారాహి టూర్ తో లోకేష్ యాత్ర ఎటో ? జ్వరం తగ్గాక టీడీపీకి 20 సీట్ల ఆఫర్- బుగ్గన కామెంట్స్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో విపక్ష నేతలు వరుసగా యాత్రలు చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. వీటికి సీఎం జగన్ తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంతే దీటుగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో విపక్ష నేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేస్తున్న యాత్రల్ని పోలుస్తూ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాలు, విపక్ష నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఇవాళ పర్యటించిన బుగ్గన స్ధానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ విపక్షాలపై విరుచుకుపడ్డారు. వరుస యాత్రలు చేస్తున్నా ప్రతిపక్షాలకు ప్రజాదరణ కరువైందన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా పాదయాత్ర చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.

వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూటకోమాట మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆర్ధిక మంత్రి బుగ్గన విమర్శించారు. వారాహి యాత్ర చేస్తున్న నాలుగో రోజునే తానే సీఎం అని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. నారాలోకేశ్ 'యువగళం' అని మొదలుపెట్టి గళం విప్పే లోపు వారాహి వచ్చి..గళం విప్పకుండానే లోకేశ్ యాత్ర పక్కకు పోయిందన్నారు.
వారాహి వాహనం ఎక్కిన పవన్ కళ్యాణ్ మొదటి రోజు పలకరింపులు, రెండోరోజు మీ చలవతో తాను సీఎం కావాలనుకుంటున్నట్లుమూడో రోజు తానెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అంటూ, నాలుగో రోజు నేనే కదా ముఖ్యమంత్రి అన్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. ఇక నాలుగు రోజులకే జ్వరం బారిన పడ్డారని, జ్వరం తగ్గగానే టీడీపీకి 20 సీట్లిస్తానని పవన్ మాట్లాడతారేమోనని మంత్రి అన్నారు. ప్రజలకు చేసింది చెప్పి, చేయబోతున్నది వివరించే ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications