రేపు బందరులో పవన్ నాటును మించిన డ్యాన్స్-దాన్ని బట్టే ప్యాకేజ్ ఫైనల్-మంత్రి దాడిశెట్టి విమర్శలు..

కాపుల్లో అనైక్యతపై పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా.. అందుకు ఆయనే కారణమన్నారు.

విజయవాడ : కాపు సామాజికవర్గంలో అనైక్యతపై నిన్న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారుు. తుని రైలు దహనం కేసు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టుకు హజరైన మంత్రి దాడిశెట్టి రాజా.. అనంతరం పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.

మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ బయటికొచ్చి హడావిడి చేస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని పవన్ చేసిన వ్యాఖ్యలపైనా రాజా మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకీ మోయడమేనా అని ప్రశ్నించారు. కొత్తగా చంద్రబాబుతో కలిసి ఉన్నట్లు పవన్ మాట్లాడుతున్నాడన్నారు.
2014 నుంచి చంద్రబాబుతో పవన్ కలిసే ఉన్నాడన్నారు. పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తనకు, చంద్రబాబుకు కాపులు ఓటేయకపోతే బీసీలు బానిసలైపోతారనేలా పవన్ మాట్లాడుతున్నాడని దాడిశెట్టి రాజా ఆరోపించారు.

ap minister dadisetti raja says pawan kalyans pkg will depends on his dance in bandar tomorrow
వైసీపీ ఓట్లను చీల్చడానికి అన్ని స్థానాల్లోనూ పోటీచేశారంటూ పవన్ ను దాడిశెట్టి విమర్శించారు. 2019ఎన్నికల్లో నువ్వు ఎంతమంది బీసీలకు టిక్కెట్లిచ్చావని ప్రశ్నించారు. పవన్ రాజకీయమేంటో ఈరాష్ట్రంలో నిక్కరేసుకున్న బుడ్డోడికి కూడా తెలుసన్నారు. కాపు సేవా సమితి పేరుతో హరిరామజోగయ్య హడావిడి చేస్తున్నారని ఆక్షేపించారు. హరిరామజోగయ్య అవసరమైతే మళ్లీ చంద్రబాబు సంకనాకుతాడన్నారు. కాపు సేవా సమితిని హరిరామజోగయ్య కమ్మసేవా సమితిగా మార్చుకుంటే మంచిదన్నారు. ఈనెల 14న పవన్ యాక్టింగ్ ను బట్టి అతని ప్యాకేజ్ ఉంటుందన్నారు.

మరోవైపు RRR కు ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని, ఈనెల 14న నాటు నాటు పాటకు మించి పవన్ డాన్సు ఉంటుందని దాడిశెట్టి రాజా తెలిపారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ రేపు పవన్ చదువుతాడన్నారు. RRR కు వచ్చిన ఆస్కార్ కంటే పవన్ యాక్టింగే ఆస్కార్ రేంజ్ లో ఉండబోతోందన్నారు. పవన్ కాపులను ఎలాగూ పలకరించడని, కాపులతో పాటు ఎస్సీ,ఎస్టీల పై కేసులు ఎందుకు పెట్టావని చంద్రబాబుని అడిగావా అని నిలదీశారు. పవన్ ను కాపులు నమ్మే పరిస్థితిలో లేరని, 2024లో 175 కి 175 స్థానాలు గెలిచి తీరుతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+