Vizag Steel : బిడ్డింగ్ లో ప్రభుత్వాలు పాల్గొనకూడదు ! బీఆర్ఎస్ ఎలా పాల్గొంటుందన్న ఏపీ మంత్రి..
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామంటూ ఇన్నాళ్లు నినాదాలు చేసిన రాజకీయ పార్టీలకు ఝలక్ ఇస్తూ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ స్వాధీనం కోసం బిడ్డింగ్ లో పాలుపంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ సింగరేణి మైన్స్ కు చెందిన ఐదుగురు అధికారుల బృందం ఇవాళ స్టీల్ ప్లాంట్ ను సందర్శించింది. బిడ్ కు సంబంధించి వివరాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయత్నాలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకమా..? అనుకూలమా..? అని ఆయన ప్రశ్నించారు. వ్యతిరేకమైతే బిడ్డింగ్ లో ఎలా పాల్గొంటున్నారని నిలదీశారు. ఏడాదిన్నర క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక మెమోరాండం ఇచ్చిందని, దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం లేదన్నారు.

అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి...అధికారులు లేదా ప్రభుత్వం సమాధానం చెప్పాలని మంత్రి గుడివాడ ప్రశ్నించారు.స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనేది తమ స్టాండ్ అన్నారు. ప్రయివేటికరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. సీఎం జగన్ కూడా ప్రధాన మంత్రి కి ఇదే చెప్పారన్నారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు..ఇదే తమ నినాదం అన్నారు. మరోవైపు వైజాగ్ స్టీల్ స్వాధీనం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. మంత్రి గుడివాడ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications