సీపీఐ అంటే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా- లోకేష్ పాకుడు యాత్ర చేసినా- మంత్రి అమర్నాథ్
విశాఖలో వివాదాస్పద రుషికొండ ప్రాంతాన్ని ఇవాళ సీపీఐ నారాయణ హైకోర్టు అనుమతితో సందర్శించారు. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ స్థలంలో టూరిజం శాఖ భవనాలు కడుతుంటే ఎందుకు కడుపు మంట అని నారాయణను ప్రశ్నించారు. రుషికొండ వెళ్ళి సీపీఐ నారాయణ అంతకంటే గొప్పగా ఏం మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. సీపీఐ చంద్రబాబునాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిందని మంత్రి విమర్శించారు. విశాఖలో ఏ నిర్మాణం జరుగుతున్నా అడ్డుకోవడమే ప్రతిపక్షాల పనన్నారు. రామానాయుడు స్టూడియో, ఐటీ సెజ్ లు కొండలపై కట్టలేదా అని అమర్నాథ్ అడిగారు.
రుషికొండ అనేది ఒక పర్యాటక ప్రదేశమని, అక్కడకు ఎవరైనా రావొచ్చు, వెళ్లొచ్చని మంత్రి అమర్నాథ్ తెలిపారు. బహుశా నారాయణ కూడా పర్యాటక శాఖ రుషికొండపై చేపట్టిన భవనాల పనులను పరిశీంచడానికి వెళ్లి ఉంటారన్నారు. తాము కూడా మొదట్నించీ ఎవరైనా చూడొచ్చు అనే చెప్తున్నామన్నారు. ప్రభుత్వ స్థలంలో టూరిజం శాఖ భవనాలు నిర్మిస్తుంటే.. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం విడ్డూరమన్నారు. దయచేసి ప్రతిపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయాలకు వాడుకోవద్దన్నారు. విశాఖపట్నంలో ఏ నిర్మాణం జరిగినా దానికి అడ్డుకట్ట వేయాలనేది ప్రతిపక్షాల ప్రయత్నమని మంత్రి ఆరోపించారు.

సీపీఐ అనేది ఎప్పుడో చంద్రబాబునాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని నారాయణను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. ఆ నాయకులు అక్కడకు వెళ్ళి అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోవడం లేదన్నారు. వారు చేస్తున్నది కేవలం రాజకీయం మాత్రమేనన్నారు. రుషికొండపై గతంలో అనేక నిర్మాణాలు జరిగాయని, రామానాయుడు స్టూడియో, ఐటీ సెజ్ కొండలపైనే నిర్మాణాలు జరిగాయన్నారు. టూరిజం శాఖ ఓ భవనాన్ని రుషికొండపై నిర్మాణం చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు కడుపుమంటని ప్రశ్నించారు.
టీడీపీ నేత లోకేష్ 4 వేల కిలో మీటర్లు కాదు, 40 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా తమకే నష్టం లేదని మంత్రి అమర్నాథ్ తెలిపారు. కనీసం మంగళగిరిలో కూడా గెలవలేని వ్యక్తి, రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్, పాదయాత్ర కాదు పాక్కుంటూ యాత్ర చేసినా అధికారంలోకి రావడం కల్లేనన్నారు.












Click it and Unblock the Notifications