జగన్ కు విపక్ష హోదా- మంత్రి సంధ్యారాణి ఘాటు రియాక్షన్..!
ఏపీలో అధికార పక్షం తర్వాత అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నేతగా తనకు విపక్ష నేత హోదా కల్పించాలంటూ ఇవాళ స్పీకర్ అయన్నపాత్రుడుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రుల తర్వాత తనను ప్రమాణం చేయించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే ముందే నిర్ణయించుకున్నారంటూ ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఘాటుగా స్పందించారు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం రోజు జగన్ తన పేరు మర్చిపోయారని గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినపుడు జగన్ అసెంబ్లీ లో ఉండాలి కదా అని ప్రశ్నించారుస్పీకర్ కి జగన్ గౌరవం ఇచ్చారా అని నిలదీశారు. ఇవన్నీ చేయని జగన్.. ఇప్పుడు గౌరవ మర్యాదల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం పంచభూతాలు అసహ్యించుకునేలా దోచేసిందన్నారు. అందుకే 151లో మధ్యలో 5 పోయి 11 మిగిలాయంటూ మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.

మరోవైపు విపక్ష హోదా విషయంలో సంప్రదాయాలు పాటించడం లేదంటూ స్పీకర్ కు జగన్ రాసిన లేఖపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉండిపోయిన ఆయనకు విపక్ష హోదా విషయంలో సంప్రదాయాలు గుర్తుచేసే హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టే సమయంలో సభకు రాకుండా జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు.












Click it and Unblock the Notifications