వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సీఎం అవుతారని కేసీఆర్! ఏపీ మంత్రికి ఒళ్లు మండింది! తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా పనికిరాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఊహించుకోవడం సీఎం కేసీఆర్‌ అవివేకానికి నిదర్శనమని జవహర్‌ అన్నారు.

కేసీఆర్, జగన్ సంబంధాలు తెరపైకి..

కేసీఆర్, జగన్ సంబంధాలు తెరపైకి..

సర్వే ఫలితాలంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై జవహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, జగన్‌ సంబంధాలు మరోసారి బయటపడ్డాయన్నారు. ఏపీ అభివృద్ధి కోసం 2014లో ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారని అన్నారు.

Recommended Video

Chandrababu Naidu Survey Report on Ministers
జవహర్ తీవ్ర వ్యాఖ్యలు

జవహర్ తీవ్ర వ్యాఖ్యలు

ఫాం హౌస్‌ను వీడి కేసీఆర్‌ జ్యోతిష్యాలయం పెట్టుకోవాలని ఆయన సూచించారు. 2014 ఎన్నికలప్పుడు కూడా కేసీఆర్ ఇలాంటి జ్యోతిష్యాలే చెప్పి.. కేసీఆర్‌ అభాసుపాలయ్యారని ఈ సందర్భంగా జవహర్‌ గుర్తుచేశారు. ఏపీలో జగన్ పార్టీకి 45 శాతం, టీడీపీకి 43 శాతం, బీజేపీకి 2 శాతం, జనసేన పార్టీకి 1.2 శాతం ఓట్లు వస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి జవహర్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో 25ఏళ్లు బాబే

మరో 25ఏళ్లు బాబే

25 ఏళ్లపాటు ఏపీలో రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని, అప్పటి వరకు సీఎంగా చంద్రబాబే ఉంటారని జవహర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణ టీడీపీ శ్రేణులు కూడా కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టాయి.

చేయి కలిపి నవ్వుతూ..

చేయి కలిపి నవ్వుతూ..

ఇది ఇలా ఉండగా, శుక్రవారం జరిగిన రామోజీరావు మనవరాలి వివాహ మహోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్.. చంద్రబాబులు చేయి కలిపి నవ్వుతూ మాట్లాడుకోవడం గమనార్హం.

English summary
Andhra Pradesh minister Jawahar fired at Telangana CM K Chandrasekhar Rao for
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X