పూనం కౌర్‌పై మంత్రి కొల్లు సంచలనం: మహేష్ కత్తికి ఫ్యాన్స్ రిప్లై

Posted By:
Subscribe to Oneindia Telugu
Poonam Kaur Issue : పూనం కౌర్‌ సంచలనం : మహేష్ కత్తికి ఫ్యాన్స్ రిప్లై

అమరావతి: సినీ నటి పూనమ్ కౌర్‌ై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ప్రకటన చేశారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ కౌర్‌ను ఎలా నియమించారని సినీ క్రిటిక్ మహేష్ కత్తి ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.

ఆ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. పరిస్థితిని సర్దుబాటు చేయడానికి అవసరమైన చర్యలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.

 నేను ఎవరినీ నియమించలేదు..

నేను ఎవరినీ నియమించలేదు..

తాను చేనేత శాఖ మంత్రిగా ఉన్న కాలంలో చేనేత బ్రాండ్ ్అంబాసిడర్‌గా ఎవరినీ నియమించలేదని కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రభుత్వపరంగా అలాంటి నియామకమే జరగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చనే జరగలేదని, కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని వివరిచారు. అంతకు మించి చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదని మంత్రి చెప్పారు.

 కత్తి మహేష్‌కు వివరణ ఇదీ..

కత్తి మహేష్‌కు వివరణ ఇదీ..

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `జ‌ల్సా` సినిమాలో క‌మలినీ పాత్ర కోసం తొలుత పూన‌మ్ కౌర్‌ను తీసుకున్నారని, ఆ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన పూజ‌ల్లోనే ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి పూన‌మ్ పాల్గొందని, అయితే ఆ త‌ర్వాత ప‌వ‌న్ సరసన పూన‌మ్ సెట్ కాదని భావించి దర్శకుడు క‌మ‌లినీని తీసుకున్నాడని పవన్ కల్యాణ్ అభిమాులు వివరించారు. తద్వారా పూజలపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ అభిమానులు సమాధానం చెప్పారు.

 అందుకే ఆత్మహత్యాప్రయత్నం

అందుకే ఆత్మహత్యాప్రయత్నం

సినీ పరిశ్ర‌మ‌లో ఇలాంటివి సాధార‌ణ‌మే అయినప్పటికీ కెరీర్‌ సమస్యల్లో పడిందనే బాధతో పూన‌మ్ డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకుందని పవన్ కల్యాణ్ అభిమానులు చెప్పారు. దీనికి తాను కూడా ఎంతో కొంత కార‌ణం అని భావించిన ప‌వ‌న్ కల్యాణ్ ఆమెను ఆస్పత్రికి వెళ్లి ప‌రామ‌ర్శించి బిల్లు క‌ట్టారని చెప్పారు. పూన‌మ్ కెరీర్‌లో స్థిర‌ప‌డ‌డానికి త‌న వంతుగా స‌హాయం చేస్తానని పూన‌మ్ త‌ల్లికి మాటిచ్చినట్లు తెలిపారు.

 అలా చెప్పడం తప్పేం ఉంది..

అలా చెప్పడం తప్పేం ఉంది..

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎవ‌రిని పెట్టాలని ఆలోచిస్తున్న‌ప్పుడు పూన‌మ్ కౌర్ పేరును ప‌వ‌న్ కల్యాణ్ సూచించారని ఆయన అభిమానులు చెప్పరు. ఇందులో ప‌వ‌న్ చేసిన త‌ప్పేమీ లేదని స్పష్టం చేశారు. దాదాపుగా చాలా ప్రశాంతంగా సరైన సమాధానాలు ఇస్తూ పవన్ కల్యాణ్ ఇచ్చినవివరణ ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది.

 డిబేట్ మధ్యలో వెళ్లిపోయిన కత్తి

డిబేట్ మధ్యలో వెళ్లిపోయిన కత్తి

ఇటీవ‌ల ఓ చాన‌ల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో క‌త్తి మ‌హేష్‌కు తీవ్రమైన ఇబ్బంది వచ్చి పడింది. అదే డిబేట్‌లో పాల్గొన్న డైరెక్ట‌ర్ వివేక్ క‌త్తిని అత‌ని త‌ల్లి గురించి ప్ర‌శ్నించాడు. మీ తల్లి గురించి చెప్పండి అని అడిగిన సమయంలో కత్తి మహేష్ చర్చలోంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఇది మీడియాలో చర్చనీయాంశమైంది.

 అందుకే అలా వెళ్లిపోయా...

అందుకే అలా వెళ్లిపోయా...

చాలా అవమానించినట్లు అనిపించడం వల్లనే ఆ కార్యక్రమం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశానని, తననూ తన త‌ల్లిని అవ‌మాన‌ంచినట్లు అనిపించిందని, తన త‌ల్లిని అవ‌మాన‌ ప‌ర‌చాల‌నుకునే వ్య‌క్తికి తనకూ, తన త‌ల్లికి మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ఎలా చెబుతానని కత్తి మహేష్ అన్నారు. తన త‌ల్లి జ్ఞాప‌కాలు ఇంకా స‌జీవంగానే ఉన్నాయని, ఆ జ్ఞాప‌కాలు బాధాక‌ర‌మైన‌వని క‌త్తి ట్వీట్ చేశాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Kollu Ravindra made statement on Poonam Kaur issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి