దుబాయ్‌లో జై షాతో నారా లోకేష్ భేటీ.. టీ20 క్రికెటర్లతో ఫొటోలు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగుతన్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించేందుకు నారా లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జైషాతో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై జైషాతో చర్చించినట్లు ఏపీ మంత్రి తెలిపారు.
లోకేశ్ తోపాటు ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, ఉపాధ్యక్షుడు సానా తీశ్, దర్శకుడు సుకుమార్ తదితరులు కలిసున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో నారా లోకేశ్, తన తనయుడు దేవాన్ష్‌తో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మతోనూ నారా లోకేష్ తన తనయుడితో కలిసి ఫొటోలు దిగారు.

మరోవైపు, భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు మనదేశం నుంచే గాక, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు ప్రముఖులు దుబాయ్ వెళ్లారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. చిరంజీవి పక్కన కూర్చుని భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ లు కనిపించారు.

Delighted to be with two of my favourite explosive left-handed batsmen: @IamAbhiSharma4 and our very own Telugu star @TilakV9.#INDvsPAK #ChampionsTrophy pic.twitter.com/yQ5yLLN7ny
— Lokesh Nara (@naralokesh) February 23, 2025
కాగా, ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు అలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 42.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి శతకం పూర్తి చేశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 57 బంతుల్లో 56 (5 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. ఇక శుభమన్ గిల్ 46 పరుగులు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ20 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు రోహిత్. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండు విజయాలను సాధించింది.












Click it and Unblock the Notifications