ఇంకా జగన్ పరదాలు పోలేదా ? అధికారులకు లోకేష్ చీవాట్లు..!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరగబోతోంది. కానీ గత ప్రభుత్వపు వాసనలను మాత్రం అధికారులు వదులుకోలేకపోతున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు కుటుంబం ఇవాళ దర్శనం చేసుకుంటోంది. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు గతంలో జగన్ హయాంలో కట్టినట్టుగానే పరదాలు కనిపించాయి. దీంతో ఆయన అధికారులపై సెటైర్లు వేశారు.
పరదాలు కట్టకుండా ఉండలేకపోతున్నారా, వాత అలవాట్లు పోలేదా అంటూ లోకేష్ అధికారులపై సున్నితంగానే అక్షింతలు వేశారు. మనకు పరదాలు అక్కర్లేదంటూ వారికి సూచించారు. దీంతో పరదాలు తొలగిస్తామంటూ అధికారులు మంత్రి లోకేష్ కు తెలిపారు. చంద్రబాబు కుటుంబం తిరుమల పర్యటన సందర్భంగా అధికారులు జగన్ పాలన తరహాలో కట్టిన పరదాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

సీఎం చంద్రబాబు పర్యటనలో మాజీ సీఎం పర్యటనకు కట్టినట్లే ఇప్పుడు కూడా మళ్లీ దారి వెంట అధికారులు పరదాలు కట్టడంతో అటువంటి పనులు చేయొద్దంటూ వారికి సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి. తన పర్యటనల్లో అనవసరపు ఆంక్షలు వద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని అన్నారు. ఇప్పటికే సీఎం పలుసార్లు చెప్పారని, ఆ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి. చివరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు.












Click it and Unblock the Notifications