తీపి కబురు: అక్కడే ప్లాట్లు, శిలాక్షరాలపై రైతుల పేర్లు
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి జూన్ 6వ తేదీన భూమి పూజ చేస్తున్న ప్రాంతంలో ఎప్పటికీ నిలిచి ఉండేలా సుందర ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ రాజధాని భూమిపూజ జరిగిన చిహ్నంగా ఒక కట్టడం నిర్మించి, దానిపై రాజధాని నిర్మాణానికి భూసమీకఱణ చేసిన గ్రామాలు, భూములిచ్చిన రైతుల పేర్లు శిలాక్షరాలుగా చెక్కాలని నిర్ణయించారు.
వారి త్యాగం భవిష్యత్తు తరాలకు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఏర్పాటు చేయనున్నారు. భూమిపూజ చేసేందుకు తుళ్లూరు మండలంలోని మందడం, తాళ్లాయపాలెం గ్రామాల మధ్య ఇప్పటికే ఒక ప్రాంతాన్ని గుర్తించారు. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తదితరులు శనివారం ఈ స్థలాన్ని పరిశీలించారు.
ఏ గ్రామంలో వారికి ఆ గ్రామంలో ప్లాట్లు
రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఎక్కడ గజాలు ఇస్తారోనని దిగులు చెందిన రైతులకు ప్రభుత్వం పూర్తి భరోసానిస్తూ ఏ గ్రామంలో వారికి ఆ గ్రామంలోనే రైతులకు ఇచ్చే ప్లాట్లు ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు.

సింగపూర్ నుంచి తిరిగొచ్చిన మంత్రి శనివారం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతూ ప్రభుత్వం బెటర్‌గా పని చేస్తుందనానికి నిదర్శనమే ఏ గ్రామంలో వాళ్లకి ఆ గ్రామంలోనే ప్లాట్లు ఇవ్వటానికి నిర్ణయం తీసుకోవటమే అన్నారు.
ఇందుకు సింగపూర్ బృందంతో మాట్లాడి డిజైన్ సిద్ధం చేసినట్టు తెలిపారు. తన రెండు రోజుల సింగపూర్ పర్యటనలో దీనిపైనే ఎక్కువ దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ నెల 25 రాజధాని సిటీ డిజైన్ వస్తుందని చెప్పారు. ఆ తరువాత సీడ్ క్యాపిటల్ డిజైన్ సిద్ధవుతుందని తెలిపారు.
జూన్ 6 ఉదయం 8.49 నిమిషాలకు రాజధానికి భూమి పూజ ముహుర్తం ఖరారైందని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి బోరుపాలెం వరకు రాజధాని ఉత్తర హద్దు ఉందని, ఆ ప్రాంతంలోనే భూమి పూజ ఉంటుందని చెప్పారు. తాళ్ళాయపాలెం, వెంకటపాలెం మధ్యలో భూమి పూజ ఉండవచ్చని అన్నారు. రెండు రోజులలో స్థలాన్ని ఎంపిక చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications