రాజీనామాలు వేస్ట్‌- వాటితో ప్రైవేటీకరణ ఆగదు- మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం కాక రేపుతున్న నేపథ్యంలో అధికార వైసీపీ ప్రజాప్రతినిధుల రాజీనామాలకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే వారిని తిరిగి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. తాజా పరిణామాలపై పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రంపై అంతా కలిసి పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు. రాజీనామా చేయాలని తెదేపా చేస్తున్న వ్యాఖలు అర్ధరహితమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సీఎం జగన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని..తెదేపా సహా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను దిల్లీకి తీసుకెళ్తామని చెప్పారని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఏ సమస్యపైన అయినా ఒక్కసారైనా అఖిలపక్షం పెట్టారా అని నిలదీశారు.

ap minister peddireddy dismiss tdps resignations demand for vizag steel, says no use

పంచాయతీ ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 90శాతం విజయం వైకాపాదేనని స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికలు వస్తే వైకాపాకు 170 స్థానాలను కైవసం చేసుకుంటుందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు ఐదారుగురు రాజీనామా చేస్తే వైసీపీకి చెందిన 151 మంది రాజీనామాలు చేయాలా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ తల్చుకుంటే అచ్చెన్నాయుడు సహా అంతా వైసీపీలోకి వచ్చి ఉండేవారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+