వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్.! వారితో జాగ్రత్త: రాంగోపాల్ వర్మ, 10న ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ ఖరారు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్ల విషయంలో వరుసగా ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. అనుమతిస్తే మంత్రి పేర్ని నానితో భేటీ అవుతానని, సినిమా టికెట్ల అంశంపై చర్చిద్దామని రాంగోపాల్ వర్మ కోరిన విషయం తెలిసిందే. అందుకు పేర్ని నాని కూడా సానుకూలంగా స్పందించి కలుద్దామని చెప్పారు.

రాంగోపాల్ వర్మకు మంత్రి పేర్ని నాని నుంచి పిలుపు

రాంగోపాల్ వర్మకు మంత్రి పేర్ని నాని నుంచి పిలుపు

ఈ క్రమంలో తాజాగా, మంత్రి పేర్ని నాని నుంచి రాంగోపాల్ వర్మకు పిలుపు వచ్చింది. సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలకాలనే ఉద్ధేశ్యంతో ఎట్టకేలకు రాంగోపాల్ వర్మకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ సాగుతున్న తరుణంలో.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై రామ్ గోపాల్ వర్మ సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

జనవరి 10న పేర్ని నానితో భేటీ, రాంగోపాల్ వర్మ ఏమన్నారంటే?

జనవరి 10న పేర్ని నానితో భేటీ, రాంగోపాల్ వర్మ ఏమన్నారంటే?

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సినీ పరిశ్రమ నుంచి రామ్ గోపాల్ వర్మను ప్రభుత్వంతో చర్చించేందుకు పిలిచారు మంత్రి పేర్ని నాని. ఈ సమస్యలన్నింటిపైనా జనవరి 10వ తేదీన రామ్ గోపాల్ వర్మతో భేటిలో చర్చించనున్నారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జనవరి 10వ తేదీన మధ్యాహ్నం భేటీ అవుతామని, సినిమా టికెట్ ధరల సమస్యలపై చర్చిస్తామని వర్మ తెలిపారు. భేటీకి ఆహ్వానించిన మంత్రి పేర్ని నానికి రాంగోపాల్ వర్మ ధన్యవాదాలు తెలిపారు.

జగన్.. వారితో జాగ్రత్త అంటూ రాంగోపాల్ వర్మ

జగన్.. వారితో జాగ్రత్త అంటూ రాంగోపాల్ వర్మ

ఇది ఇలావుండగా, మరో సంచలన ట్విట్ చేశారు. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉద్భోద చేశారు. మీ చుట్టూ వైసీపీ నేతలతో జాగ్రత్త అంటూ సూచించారు. వైసీపీ నేతలు సీఎం జగన్‌ను తప్పు దారి పట్టిస్తున్నారంటూ పేర్కొన్నారు.వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారని వర్మ తన ట్వీట్‌లో రాశారు. ఇకనైనా తన చుట్టూ ఉన్న ప్రమాదకర వ్యక్తుల పట్ల జగన్ అప్రమత్తంగా ఉంటారని నమ్ముతున్నా.. అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఇక, ఆ పార్టీలో గౌరవించే ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని ఆర్జీవీ అన్నారు. కాగా, వర్మ ఈ ట్విట్‌తో ఏపీ రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా వర్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పలువురిని ఉద్దేశించే ఈ ట్విట్ చేసినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
AP minister Perni Nani invites Ram Gopal Varma to discuss on cinema ticket rate issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X