Roja: కుమార్తె సినీ రంగ ప్రవేశంపై క్లారిటీ, సంతోషిస్తానంటూ వెల్లడి, కానీ.!

హైదరాబాద్: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా.. అంతకుముందు సినిమాల్లో రాణించిన విషయం తెలిసిందే. అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రోజా.. ఇటీవల కూడా పలు కీలక పాత్రలు పోషించి మెప్పించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు సినిమాల్లో నటించడం మానేశారు. మంత్రి పదవి వరించిన నేపథ్యంలో ప్రజాసేవకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

కుమార్తె అన్షుమాలిక సినీ ఎంట్రీపై రోజా ఏమన్నారంటే..?

కుమార్తె అన్షుమాలిక సినీ ఎంట్రీపై రోజా ఏమన్నారంటే..?


అయితే, రోజా సినీ వారసత్వాన్ని ఆమె కుమార్తె అన్షుమాలిక కొనసాగిస్తుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజా స్పష్టతనిచ్చారు. తన కుమార్తె శాస్త్రవేత్త అవ్వాలనే ఆలోచనలో ఉందని తెలిపారు. ప్రస్తుతానికి సినిమాలో నటించే ఆలోచన తన కుమార్తెకు లేదని స్పష్టం చేశారు. అయితే, తన కుమార్తె, కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే.. ఒక తల్లిగా, నటిగా తానే ఎక్కువగా సంతోషిస్తానని రోజా వెల్లడించారు. వారికి అండగా నిలబడతానని చెప్పారు.

పుట్టిరోజున తిరుమలలో మంత్రి రోజా

పుట్టిరోజున తిరుమలలో మంత్రి రోజా

కాగా, తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు మంత్రి రోజా. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్దత్ టీం సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమె వెంట జబర్దస్త్ నటి వర్షిణి, సింగర్ మంగ్లీ ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

జగన్ ఆశీస్సుల వల్లేనంటూ రోజా వ్యాఖ్యలు

జగన్ ఆశీస్సుల వల్లేనంటూ రోజా వ్యాఖ్యలు

కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకున్నానని.. శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా.. సంతోషంగా ఉంటుందన్నారు రోజా. తాను అన్నమయ్య సినిమాలో నటించడం సంతోషంగా ఉందని గుర్తు చేసుకున్నారు. స్వామిని చూడగానే మనం కూడా దేవుడి కుటుంబ సభ్యులుగా ఓ ఫీలింగ్.. తిరుపతి చుట్టుపక్కల వారికి మా స్వామి అని ఫీలింగ్ ఉంటుందని రోజా చెప్పుకొచ్చారు. అందుకే తాను తిరుపతి ప్రాంతంలో పుట్టడం, రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు రోజా తెలిపారు. శత్రువులను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి రోజా తెలిపారు. తనకు ఆరోగ్యం ప్రసాదించమని కోరినట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరానని రోజా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+