వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ప్రమాదకరం, జాగ్రత్త: మంత్రి సురేష్ చురకలు, చీప్ పబ్లిసిటీ అంటూ సజ్జల విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా, ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా ఈ రాష్ట్రానికి కూడా గుదిబండలా తయారయ్యారని అన్నారు.

పవన్ కళ్యాణ్ చిచ్చుపెట్టొద్దు: మంత్రి సురేష్

పవన్ కళ్యాణ్ చిచ్చుపెట్టొద్దు: మంత్రి సురేష్

ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకుకునే పవన్ కళ్యాణ్.. కులాల మధ్య చిచ్చుపెట్టడం తగదని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది పద్ధతి కాదని ఆయన సూచించారు. ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలనే దోరణితో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పోరాడుతున్నారు?.. ఏ అజెండాతో ముందుకెళ్తున్నారని ప్రశ్నించారు. మొదట ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలన్నారు.

ప్రమాదకరంగా పవన్ కళ్యాణ్..: ఆదిమూలపు సురేష్

ప్రమాదకరంగా పవన్ కళ్యాణ్..: ఆదిమూలపు సురేష్

ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై పవన్ మాట్లాడిన తీరు సినీ పరిశ్రమ వారికే నచ్చలేదని అన్నారు. సినీ పరిశ్రమ బాగుపడుతుందనే కారణంగానే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని కోరుకున్నామని స్వయంగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలే చెబుతున్నారని మంత్రి సురేష్ తెలిపారు. వారంతా ఒక క్లారిటీతో ఉంటే.. పవన్ మధ్యలో వెళ్లి రాజకీయం జోడించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న భాష, ఆలోచన విధానం చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు.

చీప్ పబ్లిసిటీ అంటూ పవన్ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్

చీప్ పబ్లిసిటీ అంటూ పవన్ కళ్యాణ్‌పై సజ్జల ఫైర్


మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పవన్ కళ్యాణ్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసే శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు చేయడం మానుకోవాలన్నారు. కెమెరా ఆన్ చేసి యాక్షన్ అనగానే చెయ్యడానికి ఇది సినిమా కాదని వ్యాఖ్యానించారు. గోతులు పూడ్చి ఫొటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదన్నారు సజ్జల. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 2,200 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. చీప్‌ పబ్లిసిటి కోసం ఇలాంటి పనులు చెయ్యడం పవన్ కల్యాణ్ మానుకోవాలి. పవన్ స్థాయికి మేము దిగజారాల్సిన అవసరం లేదు. జనసేన దిశ లేకుండా ప్రయాణం చేస్తుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్‌కు భయపడి రోడ్లు వేశామని అనుకోవడం వారి భ్రమ అని, ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని సజ్జల పేర్కొన్నారు.

Recommended Video

AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
బద్వేల్ ఉపఎన్నికకు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏంటి?: సజ్జల

బద్వేల్ ఉపఎన్నికకు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏంటి?: సజ్జల

పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి అని, నాలుగు నెలలకు ఒకసారి వచ్చి కార్యక్రమాలు చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని విమర్శలు గుప్పించారు. ఇక బద్వేల్ ఉపఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా తమకు నష్టం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఉపఎన్నికలో పోటీ చేయడానికి పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్ ఎంత అని ప్రశ్నించారు. కాగా, శ్రమదానం పేరుతో పవన్ కళ్యాణ్ జనసేన ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్న విషయం తెలిసిందే. అధ్వాన్నంగా తయారైన రోడ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని పవన్ చెబుతున్నారు. ఇప్పటికే శ్రమదానం పేరుతో రోడ్లును మరమ్మతులు చేయడం ప్రారంభించారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఆన్‌లైన్ టికెట్లను ప్రభుత్వం విక్రయించడంపై పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.

English summary
AP minister Suresh and ysrcp leader Sajjala Ramakrishna Reddy slams Pawan Kalyan for his comments on govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X